పీఆర్సీపై ఉద్యోగుల సమ్మె నోటీసు: జగన్ ఉన్నత స్థాయి సమీక్ష

By narsimha lode  |  First Published Feb 4, 2022, 4:59 PM IST

ఈ నెల 7వ తేదీ నుండి సమ్మె చేస్తామని ఉద్యోగులు ప్రకటించిన నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ శుక్రవారం నాడు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. 


అమరావతి: ఈ నెల 7వ తేదీ నుండి strike చేస్తామని  ఉద్యోగులు ప్రకటించిన నేపథ్యంలో  ఏపీ సీఎం వైఎస్ జగన్ శుక్రవారం నాడు సాయంత్రం తన క్యాంప్ కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

 ఆదివారం అర్దరాత్రి నుంచి Employees సమ్మెకు వెళ్లనున్న నేపథ్యంలో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఉద్యోగులు ఇవాళ  చేపట్టిన పెన్ డౌన్, యాప్స్ డౌన్ పై చర్చిస్తున్నారు. ఉద్యోగ సంఘాల డిమాండ్ల పై  సీఎం వైఎస్ జగన్  చర్చిస్తున్నారు.  పీఆర్సీ సహా హెచ్ ఆర్ ఎ, ఇతర డిమాండ్ల పైనా చర్చిస్తున్నారని సమాచారం. ఉద్యోగులు సమ్మెకు వెళ్తే  తీసుకోవాల్సిన చర్యలపై సీఎం చర్చిస్తున్నారు.పాలన స్తంభించకుండా  తీసుకోవాల్సిన  ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సీఎం చర్చిస్తున్నారు.

Latest Videos

undefined

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో ఉద్యోగ సంఘాల నేతలు ఈ ఏడాది జనవరి 7వ తేదీన భేటీ అయ్యారు. ఈ సమావేశంలో 23.29 శాతం పీఆర్సీ ఫిట్‌మెంట్ ఇస్తామని సీఎం   YS Jagan హామీ ఇచ్చారు. అంతేకాకుండా పెండింగ్ లోని ఐదు D.A లను ఒకే సారి ఇస్తామని హమీ ఇచ్చారు. ఫిట్‌మెంట్ కనీసం 27 శాతానికి తగ్గకుండా ఉండాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. అయితే పెండింగ్ డిఏలు ఒకేసారి ఇస్తామని హమీ ఇవ్వడంతో ఉద్యోగ సంఘాలు సానుకూలంగా స్పందించాయి.

ఈ భేటీ తర్వాత Hraవిషయమై Chief Secretary నేతృత్వంలోని కమిటీతో ఉద్యోగ సంఘాలు సంక్రాంతి పర్వదినం కంటే ముందే పలు దఫాలు భేటీ అయ్యారు. కానీ ఈ సమావేశాల్లో ఉద్యోగ సంఘాల డిమాండ్ పై ప్రభుత్వం నుండి స్పష్టత రాలేదు.  అయితే జనవరి 17వ తేదీ రాత్రి పీఆర్సీపై  ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. ఈ జీవోల్లో హెచ్ఆర్‌ఏను భారీగా తగ్గించడంపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి.

30 శాతంగా ఉన్న హెచ్ఆర్ఏ స్థానంలో 16 శాతం హెచ్ఆర్ఏ ఇవ్వడంతో తాము 14 శాతం నష్టపోతున్నామని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోలను వెనక్కి తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ డిమాండ్ పై ప్రభుత్వం నుండి సానుకూలంగా స్పందించలేదు. దీంతో సమ్మెకు వెళ్లాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయం తీసుకొన్నాయి.  జనవరి 24న రాష్ట్ర ప్రభుత్వానికి సమ్మె  నోటీసును అందించాయి. ఈ నెల 7వ తేదీ నుండి ఉద్యోగలు సమ్మెలోకి వెళ్లనున్నారు. ఈ నెల 3న ఛలో విజయవాడను ఉద్యోగ సంఘాలు నిర్వహించాయి. ఎన్ని అడ్డంకులున్న సృష్టించినా కూడా ఛలో విజయవాడను ఉద్యోగ సంఘాలు విజయవంతం చేశాయి.


 

click me!