AP Bhavan: ఏపీ భ‌వ‌న్‌ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ప్రవీణ్ ప్రకాశ్

Published : Feb 19, 2022, 02:49 PM IST
AP Bhavan: ఏపీ భ‌వ‌న్‌ ప్రిన్సిపల్  రెసిడెంట్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ప్రవీణ్ ప్రకాశ్

సారాంశం

AP Bhavan: ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ (పీ.ఆర్.సీ) గా ప్రవీణ్ ప్రకాశ్ బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పెండింగ్ సమస్యలను.. కేంద్ర ప్రభుత్వ సమన్వయంతో పరిష్కరించడానికి కృషి చేస్తానని చెప్పారు.   

Andhra Pradesh Bhavan: ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ (Andhra Pradesh Bhavan) ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ ( Principal Resident Commissioner) (పీ.ఆర్.సీ) గా ప్రవీణ్ ప్రకాశ్ బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పెండింగ్ సమస్యలను.. కేంద్ర ప్రభుత్వ సమన్వయంతో పరిష్కరించడానికి కృషి చేస్తానని చెప్పారు. ఆయ‌న‌ బాధ్యతలు స్వీకరించే ముందు అధికారులు, సిబ్బంది ఘన స్వాగతం పలికారు.  తరువాత ఢిల్లీ లోని  ఏ.పీ భవన్ లోని శ్రీ వేంకటేశ్వర స్వామిని, అమ్మవారు దుర్గా దేవికి పూజలు నిర్వహించారు.  అనంతరం ఏ.పీ భవన్ లోని గురజాడ కాన్ఫరెన్స్ హాల్ లో  ఏ.పీ భవన్ (Andhra Pradesh Bhavan) పీ.ఆర్.సీ గా బాధ్యతలు స్వీకరించారు. 

తదనంతరం మాజీ పీ.ఆర్.సీ  అభయ త్రిపాటి కి మరణానంతరం నివాళులు అర్పిస్తూ అధికారులు, సిబ్బందితో కలిసి రెండు నిమిషాలు మౌనం పాటించారు. ప్రవీణ్ ప్రకాష్  మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పెండింగ్ సమస్యలను కేంద్ర ప్రభుత్వ సమన్వయంతో పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ది చేయడానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఏ.పీ భవన్ (Andhra Pradesh Bhavan) అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

కాగా, ఢిల్లీలోని ఏపీ భవన్ (Andhra Pradesh Bhavan) ప్రిన్సిపాల్ రెసిడెంట్ కమిషనర్​ ( Principal Resident Commissioner) గా ప్రవీణ్ ప్రకాష్ బదిలీకి సంబంధించి  సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. సీఎంవో ప్రిన్సిపాల్ సెక్రెటరీగా ఇంత‌కు ముందు ఆయ‌న కొన‌సాగారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ భవన్ రెసిడెంట్ కమిషనర్​గా ఉన్న భావనా సక్సేనాను రిలీవ్ చేస్తూ కేంద్రం నుంచి తాజాగా దేశాలు వెలువడ్డాయి. ఈ తరుణంలో ప్రవీణ్ ప్రకాశ్​ను బదిలీ  చేస్తూ ఏపీ సీఎస్ సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్