ప్రత్తిపాడు (ఎస్సీ) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 

Published : Mar 05, 2024, 10:50 PM ISTUpdated : Mar 14, 2024, 07:56 PM IST
ప్రత్తిపాడు (ఎస్సీ) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 

సారాంశం

ప్రత్తిపాడు : గుంటూరు జిల్లాలోని ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో ప్రత్తిపాడు ఒకటి. ఇక్కడి నుండి ప్రస్తుతం మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నప్పటికీ ఈసారి ప్రత్తిపాడు వైసిపి టికెట్ ఆమెకు దక్కలేదు. ఆమెను మరో ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం తాడికొండకు మార్చిన వైసిపి అధిష్టానం బాలసారి కిరణ్ కుమార్ ప్రత్తిపాడు బరిలో నిలిపింది. ఇక టిడిపి బూర్ల రామాంజనేయులును ప్రత్తిపాడు అభ్యర్థిగా ప్రకటించింది. 

ప్రత్తిపాడు రాజకీయాలు : 

ప్రత్తిపాడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా వుండేది. టిడిపి ఆవిర్భావం నుండి ఈ నియోజకవర్గంలో వరుసగా ఐదుసార్లు టిడిపి విజయం సాధించింది. 1983 నుండి2004 వరకు అంటే దాదాపు ఇరవై ఏళ్ళకు పైగా మాకినేని పేద రత్తయ్య ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా కొనసాగారు. అయితే 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రావి వెంకటరమణ చేతిలో రత్తయ్య ఓటమిపాలై రాజకీయాలకు దూరమయ్యారు. 

అయితే ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో వైసిపి ఎమ్మెల్యేగా మేకతోటి సుచరిత కొనసాగారు. మధ్యలో 2014లో టిడిపి అభ్యర్థి రావెల కిషోర్ బాబు ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా గెలిచిన సుచరిత రాష్ట్ర తొలి మహిళా హోంమంత్రిగా పనిచేసారు. 

ప్రత్తిపాడు నియోజకవర్గంలోని మండలాలు : 

ప్రత్తిపాడు 
మట్టిచెరుకూరు
పెదనందిపాడు
కాకుమాను
గుంటూరు

ప్రత్తిపాడు అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు : 

ప్రత్తిపాడు వైసిపి అభ్యర్థి : 

ప్రత్తిపాడు ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం నుండి మేకతోటి సుచరిత రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మూడోసారి కూడా ఆమె ప్రత్తిపాడు నుండి పోటీకి సిద్దమైన వైసిపి అధిష్టానం మాత్రం ఆమెను తాడికొండకు మార్చారు. ప్రత్తిపాడు నుండి మొదటిసారి మాదిగ సామాజికవర్గానికి చెందిన బాలసాని కిరణ్ కుమార్ బరిలో దిగారు. అయితే మాల సామాజికవర్గం అభ్యర్థి సుచరితను కాదని మాదిగ సామాజికవర్గానికి సీటు కేటాయించడం వైసిపిలోని ఓ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. 
 

ప్రత్తిపాడు టిడిపి అభ్యర్థి :

ప్రత్తిపాడు టిడిపి అభ్యర్థిగా బూర్ల రామాంజనేయులు పోటీ చేస్తున్నారు. ఈయన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. రాజకీయాలపై మక్కువతో టిడిపిలో చేరిన ఈయన టీడీపీ హెచ్‌ఆర్‌డీ వింగ్‌ ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ, చైర్మన్‌ గా పనిచేసారు. ఆయన పనితీరుకు మెచ్చి టిడిపి ప్రత్తిపాడు బరిలో నిలిపింది. 


ప్రత్తిపాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు : 

ప్రత్తిపాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019 : 

ప్రత్తిపాడు నియోజకవర్గంలో 2019 జరిగిన ఎన్నికల ప్రకారం 202808 మంది ఓటర్లున్నారు. వీరలో 1,64,192 మంది 2019 ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకున్నారు.  వీరిలో 82,688 మంది పురుషులు, 81,501 మంది మహిళలు ఓటుహక్కును వినియోగించుకున్నారు.  అత్యధిక ఓట్లు సాధించిన  వైసిపి అభ్యర్థి మేకతోటి సుచరిత విజేతగా నిలిచారు. అనంతరం వైఎస్ జగన్ కేబినెట్ లో కీలకమైన హోంమంత్రిగా పనిచేసారు. 

ప్రత్తిపాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2014 : 
 
రావుల కిషోర్ బాబు 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. ఐఏఎస్ అధికారిగా స్వచ్చంద పదవీవిరమణ పొందిన ఆయన రాజకీయాలపై మక్కువతో టిడిపిలో చేరారు. ఎమ్మెల్యేగా గెలిచి సాంఘీక సంక్షేమ మంత్రిగా కూడా పనిచేసారు. అయితే ఆ తర్వాత రాజకీయ కారణాలతో ఆయన టిడిపిని వీడారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu