
మిర్యాలగూడలో ఇటీవల ప్రణయ్ అనే యువకుడిని దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. తమ కుమార్తె తక్కువ కులస్థుడిని ప్రేమించి పెళ్లి చేసుకుందనే కారణంతో అమృత తండ్రి మారుతీరావు ప్రనయ్ ని పట్టపగలే దారుణంగా హత్య చేయించాడు. ఈ ఘటన మరవకముందే.. ఇలాంటి మరిన్ని ఘటనలు రోజుకొకటి పుట్టుకొస్తున్నాయి. తాజాగా విజయవాడలో కూడా ఈ ఘటన కలకలం రేపింది.
పురువు హత్య చేస్తామంటూ విజయవాడ నగరంలో పోస్టర్లు వెలిశాయి. సోని రాహు ప్రియ పరువు హత్యకు గురికానున్నారంటూ ముద్రించిన పోస్టర్లు నగరంలో వెలిశాయి. సత్యనారాయణపురం శివాలయం వీధిలో ఈ పోస్టర్లను గుర్తుతెలియని వ్యక్తులు అతికించారు. అయితే భయపెట్టే ఉద్దేశ్యంతోనే ఇలా చేసారని స్థానికులు భావిస్తున్నారు. విషయం తెలిసిన పోలీసులు పోస్టర్లలో పేర్కొన్న రాహు ప్రియ ఎవరు?, పోస్టర్లు వేసింది ఎవరు? అనే కోణంలో విచారణ చేపట్టారు. ఇటీవల నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయ్ పరువుహత్యకు గురైన సంగతి తెలిసిందే.