విశాఖలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఓవరాక్షన్ చేశారు. తనకు వైద్యం అక్కర్లేదని అడ్డుకోబోయిన సీఐ కాలర్ పట్టుకున్నారు . ఆరోగ్యంగా వున్న తనను ఎందుకు ఆసుపత్రికి తీసుకెళ్తున్నారని ప్రశ్నించారు.
విశాఖలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఓవరాక్షన్ చేశారు. తనకు వైద్యం అక్కర్లేదని, కేజీహెచ్ దగ్గర పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అడ్డుకోబోయిన సీఐ కాలర్ పట్టుకున్నారు కేఏ పాల్. పోలీసులపై అరుస్తూ , కేకలు పెడుతూ హంగామా సృష్టించారు. తాను ఆరోగ్యంగానే వున్నానని.. వదిలిపెట్టాలని గొడవ చేశారు. కాగా.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలంటూ కేఏ పాల్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను భగ్నం చేశారు పోలీసులు. దీక్షా శిబిరం నుంచి ఆయనను బలవంతంగా తరలించారు. అంబులెన్స్ ఎక్కించి కేజీహెచ్‌కు తీసుకెళ్లారు. అయితే ఆసుపత్రికి లోపలికి వెళ్లకుండా గేటు వద్దే గొడవ చేశారు కేఏ పాల్. ఆరోగ్యంగా వున్న తనను ఎందుకు ఆసుపత్రికి తీసుకెళ్తున్నారని ప్రశ్నించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.