పోలవరం కాంట్రాక్టర్ పై దివాలా పిటీషన్

First Published Dec 30, 2017, 8:47 AM IST
Highlights
  • పోలవరం ప్రాజెక్టు పనులు గందరగోళంలో పడ్డాయి

పోలవరం ప్రాజెక్టు పనులు గందరగోళంలో పడ్డాయి. సబ్ కాంట్రాక్టర్లకు సుమారు రూ. 745 కోట్లను ప్రధాన కాంట్రాక్టు సంస్ధ ట్రాన్ స్ట్రాయ్ బకాయిపడింది. బకాయిలు తీరిస్తే కానీ పనులు ముందుకు సాగే అవకాశాలు లేవని స్పష్టమైపోయింది. సబ్ కాంట్రాక్టు సంస్ధలకు డబ్బులు చెల్లించటానికి ప్రధాన కాంట్రాక్టర్ వద్ద డబ్బులు లేవు. దాంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. ఇదిలావుంటే ట్రాన్ స్ట్రాయ్ పై బ్యాంకు దివాలా పిటీషన్ వేసింది. ప్రధాన కాంట్రాక్టు సంస్ధ తమకు బాకీ తీర్చాలంటూ కెనరా బ్యాంకు ట్రైబ్యునల్ కు వెళ్ళింది. ప్రస్తుత పరిస్ధితుల్లో పోలవరం కాంక్రీటు పనులు జరగటం కష్టమే అని తేలిపోయింది.

పోలవరం పనులను వేగంగా పూర్తి చేయాలని ఒకవైపు చంద్రబాబునాయుడు ఆతురత పడుతుంటే మరోవైపు కేంద్రం చాలా నెమ్మదిగా ఉంది. స్పిల్ వే పనులు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. కేంద్రం బిల్లులు చెల్లించని కారణంగానే పనులు ఆగిపోతున్నట్లు చంద్రబాబు చెబుతున్నారు. తమకు రాష్ట్రం సరిగా లెక్కలు చెప్పని కారణంగానే బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతోందంటూ కేంద్రం ఎదురు దాడి చేస్తోంది. రెండింటిలో ఏది నిజమో స్పష్టంగా తెలీదు కానీ పోలవరం పనులు మాత్రం నిలిచిపోయాయన్నది వాస్తవం. వాస్తవాలు కళ్ళకు కడుతున్నట్లు కనబడుతున్నా లక్ష్యాల మేరకే పోలవరం పూర్తి చేస్తానని చంద్రబాబు జనాల చెవిలో పూలు పెట్టేందుకు ఇంకా ప్రయత్నిస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది.

 

 

 

click me!