
తెలుగుదేశంపార్టీ బరితెగించింది. నోటిఫికేషన్ విడుదలైన రోజే ప్రతిపక్ష నేతల ఇళ్ళపై పోలీసులను టిడిపి ఉసిగొల్పుతోంది. నంద్యాలలోని ఇద్దరు వైసీపీ కౌన్సిలర్ల ఇళ్లపై అర్ధరాత్రి పోలీసులు దాడులు చేయటం పట్టణంలో కలకలం రేగింది. గతంలో కూడా కౌన్సిలర్ సుబ్బరాయుడు ఇంటిపై పోలీసులు అర్ధరాత్రి దాడి చేసిన సంగతి తెలిసిందే కదా? ఇపుడు 21వ వార్డు కౌన్సిలర్ అనిల్ రాజ్ ఇంటిపై పోలీసులు దాడులు చేసారు. ఎన్నికల్లో పంచటానికి డబ్బులు దాచిపెట్టారని ఫిర్యాదులు వచ్చాయంటూ ఇల్లంతా సోదాలు చేయటం పట్టణంలో చర్చ మొదలైంది. అదే విధంగా 22వ వార్డు కౌన్సిలర్ మురళి ఇంటిపై కూడా పోలీసుల దాడిపై పట్టణంలో పెద్ద చర్చ జరుగుతోంది. ఎందుకంటే, వీరిద్దరు దళితులే. అంటే బిసిలు, దళితులను లక్ష్యంగా చేసుకుని టిడిపి దాడులు చేస్తోందంటూ ప్రచారం ఊపందుకున్నది.