తిరుపతి జిల్లాలో జల్టికట్టును అడ్డుకున్న పోలీసులు.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు

Published : Jan 08, 2023, 10:44 AM IST
తిరుపతి జిల్లాలో జల్టికట్టును అడ్డుకున్న పోలీసులు.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు

సారాంశం

తమిళనాడుకు సరిహద్దుల్లో ఉన్న ఆంధ్రలోని ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలు గ్రామాల్లో కూడా ప్రతి ఏటా సంక్రాంతి సంబరాల్లో జల్లికట్టు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలు గ్రామాల్లో కూడా ప్రతి ఏటా జల్లికట్టు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పలు పల్లెల్లో ఇప్పటికే జల్లికట్టు హడావుడి మొదలైంది. అయితే జల్లికట్టు సందర్భంగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని చెబుతూ పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. జల్లికట్టు నిర్వహిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇందుకు సంబంధించి ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. 

తాజాగా తిరుపతి జిల్లా నూతిగుంటపల్లిలో జల్లికట్టు పోటీలను పోలీసులు అడ్డుకున్నారు. గ్రామంలో జల్లికట్టు కోసం స్థానికులు భారీగా ఏర్పాట్లు చేశారు. అయితే వాటిని తొలగించిన పోలీసులు.. అనుమతులు లేనిదే జల్లికట్టు నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామంలో భారీగా బలగాలను మోహరించారు. జల్లికట్టు అడ్డుకోవడంతో పోలీసులు తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయాన్ని అడ్డుకోవాలని చూడడం సరికాదని, ఆంక్షలు తొలగించాలని కోరుతున్నారు. 

ఇక, జల్లికట్టు అనే పేరు చెప్పగానే అందరికి ముందుగా తమిళనాడు గుర్తుకు వస్తుంది. అయితే తమిళనాడుకు సరిహద్దుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జల్లికట్టు తరహాలో పశువుల పండుగ జరుగుతుంది. తమిళనాడులో కనుమ రోజు జల్లికట్టు జరుకుంటే.. ఇక్కడ మాత్రం సంక్రాంతి ముందే నుంచే ప్రారంభం అవుతుంది. తిరుపతి జిల్లాలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహిస్తున్న పశువుల  పండుగపై నిషేధం విధిస్తున్నట్లు పోలీసుల శాఖ ప్రకటించడంతో సందిగ్ధత నెలకొంది.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!