స్వర్ణ ప్యాలెస్‌లో అగ్ని ప్రమాదం: విస్తృతంగా పోలీసుల సోదాలు

By narsimha lode  |  First Published Aug 10, 2020, 4:55 PM IST

విజయవాడ స్వర్ణ ప్యాలెస్ హోటల్ లో ఆదివారం నాడు జరిగిన అగ్ని ప్రమాదంపై అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి విచారణ చేస్తున్నాయి. సోమవారం నాడు స్వర్ణ ప్యాలెస్ హోటల్ యజమాని ముత్తవరపు శ్రీనివాస్ ఇంట్లో  పోలీసులు తనిఖీలు నిర్వహించారు.



విజయవాడ: విజయవాడ స్వర్ణ ప్యాలెస్ హోటల్ లో ఆదివారం నాడు జరిగిన అగ్ని ప్రమాదంపై అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి విచారణ చేస్తున్నాయి. సోమవారం నాడు స్వర్ణ ప్యాలెస్ హోటల్ యజమాని ముత్తవరపు శ్రీనివాస్ ఇంట్లో  పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

ముత్తవరపు శ్రీనివాస్ ఇంట్లో తనిఖీల సమయంలో పోలీసులు ఎవరిని శ్రీనివాస్ ఇంట్లోకి అనుమతి ఇవ్వలేదు. రమేష్ ఆసుపత్రి యాజమాన్యంతో స్వర్ణ ప్యాలెస్ హోటల్ యాజమాన్యం చేసుకొన్న ఒప్పంద పత్రాల కోసం సోదాలు నిర్వహించినట్టుగా తెలుస్తోంది.

Latest Videos

undefined

మెడికల్ ట్రీట్ మెంట్  చేయడమే తన పని అని రమేష్ ఆసుపత్రి ఎండీ రమేష్ సోమవారం నాడు ప్రకటించిన విషయం తెలిసిందే. మరో బృందం రమేష్ ఆసుపత్రిలో విచారణ చేస్తోంది. మరో బృందం ప్రమాదం జరిగిన స్వర్ణ ప్యాలెస్ ఆసుపత్రి వద్ద విచారణ చేస్తోంది. గత ఆరు మాసాలుగా స్వర్ణ ప్యాలెస్ హోటల్ లో కోవిడ్ కేర్ సెంటర్ నిర్వహిస్తున్నారు. 

also read:కోవిడ్ సెంటర్‌లో మెడికల్ సర్వీసెస్‌దే మా బాధ్యత: రమేష్ ఆసుపత్రి ఎండీ

స్వర్ణ ప్యాలెస్ హోటల్ లో ఫైర్ సేఫ్టీ పాటించలేదని  అగ్నిమాపక అధికారులు ప్రకటించారు. కోవిడ్ సెంటర్ గా మార్చిన తర్వాత అనుమతి తీసుకోలేదని కూడ ఫైర్ సేప్టీ డిపార్ట్ మెంట్ ఆదివారం నాడు ప్రకటించింది.

 ఈ ప్రమాదంపై లోతుగా దర్యాప్తు చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్టుగా అగ్నిమాపక అధికారులు ప్రకటించారు.మరో వైపు ఈ ప్రమాదంపై 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అనుమతి లేకుండా స్వర్ణ ప్యాలెస్ లో కోవిడ్ ట్రీట్ మెంట్ నిర్వహించడంపై కూడ  విచారిస్తున్నారు. 

click me!