చదివింది మూడే, శానిటైజర్ తయారీ: కురిచేడులో 16 మంది మృతికి కారణమయ్యాడు

By narsimha lodeFirst Published Aug 10, 2020, 3:49 PM IST
Highlights

ప్రకాశం జిల్లా కురిచేడులో శానిటైజర్ తాగి 16 మంది మరణించిన ఘటనలో సిట్ తీగ లాగితే తెలంగాణలో డొంక కదిలింది. 

ఒంగోలు: ప్రకాశం జిల్లా కురిచేడులో శానిటైజర్ తాగి 16 మంది మరణించిన ఘటనలో సిట్ తీగ లాగితే తెలంగాణలో డొంక కదిలింది. శానిటైజర్ తాగడంలో ప్రమాదకరమైన రసాయనాలు వాడడం వల్లే.... ఇది తాగిన వారు మరణించారనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఈ ఘటనపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు ముగిసింది. 

ప్రకాశం జిల్లా కురిచేడులో శానిటైజర్ తాగి 16 మంది మరణించారు. ఈ ఘటన ఈ నెల రెండో తేదీన వెలుగు చూసింది. వరుసగా రెండు రోజుల వ్యవధిలో శానిటైజర్ తాగిన వారు మృత్యువాత పడ్డారు.ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. ఈ కేసులో సిట్ లోతుగా దర్యాప్తు చేసింది.

తెలంగాణలోని హైద్రాబాద్ పరిధిలోని జీడిమెట్ల పరిధిలో ఫర్‌ఫెక్ట్ శానిటైజర్ ను తయారు చేస్తున్నాడు. చనిపోయిన వారంతా జీడిమెట్లలో తయారైన ఫర్‌ఫెక్ట్ శానిటైజర్ ను వాడినట్టుగా సిట్ గుర్తించింది.

ఫర్‌ఫెక్ట్ కిరాణ దుకాణాన్ని శ్రీనివాసరావు అనే వ్యక్తి నడుపుతున్నాడు. అతనే ఫర్‌ఫెక్ట్ పేరుతో శానిటైజర్ తయారు చేశాడు. మూడో తరగతి చదువు కొన్న శ్రీనివాసరావు శానిటైజర్ తయారు చేసి విక్రయించాడు.

శానిటైజర్ ఎలా తయారు చేయాలనే దానిపై యూట్యూబ్ లో వీడియోలు చూసి తయారు చేశాడు. శానిటైజర్ తయారీలో సరైన మోతాదులో రసాయనాలు వాడలేదు. 

శానిటైజర్‌ తయారీలో ఇథైల్‌ ఆల్కహాల్‌తో పాటు మిథైల్‌ క్లోరైడ్‌ను కూడా ఉపయోగించినట్టుగా సిట్ గుర్తించింది.  శానిటైజర్ ను అన్ని మెడికల్ షాపులకు కాకుండా కురిచేడులోని కొన్ని షాపులకు మాత్రమే సరఫరా అయినట్టుగా సిట్ దర్యాప్తులో తేలింది.శ్రీనివాసరావుతో పాటు మరో ఐదుగురిని అరెస్ట్ చేసిన సిట్ బృందం. 
 

click me!