చీరలు కొనడానికి వస్తే చీకటి కూపంలోకి... వ్యభిచార ముఠా గుట్టు రట్టు

Arun Kumar P   | Asianet News
Published : Mar 19, 2021, 11:39 AM IST
చీరలు కొనడానికి వస్తే చీకటి కూపంలోకి... వ్యభిచార ముఠా గుట్టు రట్టు

సారాంశం

విశ్వసనీయ సమాచారంతో వ్యభిచార గృహంపై దాడిచేసిన పోలీసులు నిర్వాహకురాలితో పాటు ముగ్గురు మహిళలు, ముగ్గురు విటులను అరెస్ట్‌ చేశారు.   

గుంటూరు: ఒంటరి మహిళలకు డబ్బులు ఆశచూపి వ్యభిచార కూపంలోకి లాగుతున్న ఓ ముఠాను గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారంతో వ్యభిచార గృహంపై దాడిచేసిన పోలీసులు  నిర్వాహకురాలితో పాటు ముగ్గురు మహిళలు, ముగ్గురు విటులను అరెస్ట్‌ చేశారు. 

గుంటూరులోని ఏటి ఆగ్రహారం జీరో లైనులో  షేక్ లాల్ బీ అనే మహిళ లక్ష్మీ మ్యాచింగ్ సెంటర్ పేరిట చీరల దుకాణం నడిపిస్తోంది. అయితే ఈజీ మనీ కోసం ఈ చీరల వ్యాపారం ముసుగులో వ్యభిచారాన్ని నిర్వహిస్తోంది సదరు మహిళ. తన షాప్ కు వచ్చే ఒంటరి మహిళలు, నిరుపేద యువతులకు మాయమాటలు చెప్పి, డబ్బులు ఆశచూపి వ్యభిచారం కూపంలోకి లాగేది. విటులను ఆకర్షించి షాప్ లోనే వ్యభిచార దందా నిర్వహిస్తోంది. 

ఈ వ్యవహారంపై పక్కా సమాచారం అందడంతో నగరంపాలెం పోలీసులు ఈ వ్యభిచార గృహంపై దాడి చేశారు. నిర్వహకురాలితో పాటు ఈ సమయంలో ఇంట్లో వున్న ముగ్గురు మహిళలు, ముగ్గురు విటులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుండి రూ.5వేల నగదు, మూడు ద్విచక్ర వాహనాలు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. 


 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం