మూతికి మాస్క్ లేకుండా బయటకు...చొక్కా విప్పించి..

By telugu news teamFirst Published Apr 27, 2020, 10:35 AM IST
Highlights

అలాంటివారిని పట్టుకొని పోలీసులు పనిష్మెంట్ ఇస్తున్నారు. మొన్నటి కి మొన్న గుంటూరు జిల్లాలో..  నేను మూర్ఖుడినంటూ ఓ సెల్ఫీ పాయింట్ పెట్టి మరీ.. ఫోటోలు తీసి శిక్ష విధించారు. తాజాగా.. కర్నూలు జిల్లాలో పోలీసులు మరింత వింత శిక్ష విధించారు.

కరోనా వైరస్ దేశవ్యాప్తంగా విలయ తాండవం చేస్తోంది. లాక్ డౌన్ విధించినప్పటికీ దేశంలో కేసులు పెరుగిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ వైరస్ ప్రభావం ఎక్కువగానే ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఊహించని విధంగా కరోనా కేసులు వెయ్యి దాటాయి. పరిస్థితి రోజు రోజుకీ విషమంగా మారుతుంది. అయినప్పటికీ కొందరు బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నారు.

ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టొద్దని ప్రభుత్వాలు, పోలీసులు నెత్తీ, నోరు కొట్టుకొని మరీ హెచ్చరిస్తున్నారు. అయినా చాలా మంది ఖతారు చేయడం లేదు. కనీసం మూతికి మాస్క్ లు కూడా లేకుండా బయట తిరుగుతున్నారు. ప్రాణం మీద కొంచెం కూడా తీపి లేకుండా తిరిగేస్తున్నారు.

అలాంటివారిని పట్టుకొని పోలీసులు పనిష్మెంట్ ఇస్తున్నారు. మొన్నటి కి మొన్న గుంటూరు జిల్లాలో..  నేను మూర్ఖుడినంటూ ఓ సెల్ఫీ పాయింట్ పెట్టి మరీ.. ఫోటోలు తీసి శిక్ష విధించారు. తాజాగా.. కర్నూలు జిల్లాలో పోలీసులు మరింత వింత శిక్ష విధించారు.

మాస్క్‌ ధరించలేదని కర్నూలు జిల్లా బేతంచెర్లలో యువకులకు సీఐ పీటీ కేశవరెడ్డి వెరైటీ పనిష్‌మెంట్‌ ఇచ్చారు. ఆదివారం పట్టణంలో లాక్‌డౌన్‌ సమయంలో పాతబస్టాండులో ఇద్దరు యువకులు మాస్క్‌లు లేకుండా తిరుగుతుండడాన్ని సీఐ, కమిషనర్‌ రమే్‌షబాబు గమనించి వారి వేసుకున్న చొక్కా విప్పించి లోపల ఉన్న బనియన్లను మాస్క్‌లుగా కట్టించి వారిని పంపించారు. 

రెడ్‌జోన్‌ ప్రాంతాల్లోని ప్రజలు బయటికి వస్తే తప్పకుండా మాస్క్‌లు ధరించాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు. లాక్‌డౌన్‌ నిబంధనలు ప్రజలు తప్పకుండా పాటించాలని కోరారు.  

click me!