మండపేట బాలుడి కిడ్నాప్ కేసులో పురోగతి.. నిందితుల గుర్తింపు

By telugu teamFirst Published Jul 24, 2019, 12:22 PM IST
Highlights

బాలుడు ఆడుకునే అపార్ట్ మెంట్ వద్దకు ఇద్దరు దుండగులు వెళ్లినట్టు సీసీ కెమేరాలో రికార్డు అయిన వీడియో ఆధారంగా పోలీసులు గుర్తించారు. నిందితులు ముఖం కనిపించకుండా కర్చీఫ్ అడ్డు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. 

తూర్పుగోదావరి జిల్లా మండపేటలోని బాలుడు కిడ్నాప్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. రెండు రోజుల క్రితం మండపేటకు చెందిన నాలుగేళ్ల బాలుడు కిడ్నాప్ కి గురైన సంగతి తెలిసిందే. కాగా... ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు కిడ్నాపర్లను గుర్తించారు. సీసీ కెమేరాలో నిందితులను పోలీసులు గుర్తించగలిగారు.

బాలుడు ఆడుకునే అపార్ట్ మెంట్ వద్దకు ఇద్దరు దుండగులు వెళ్లినట్టు సీసీ కెమేరాలో రికార్డు అయిన వీడియో ఆధారంగా పోలీసులు గుర్తించారు. నిందితులు ముఖం కనిపించకుండా కర్చీఫ్ అడ్డు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. బాలుడు ఆడుకునే అపార్ట్ మెంట్ వద్దే కిడ్నాప్ చేయడానికి  మొదట యత్నించారు. అక్కడ జనాలు ఎక్కువగా ఉండటంతో..తమ ప్రయత్నాన్ని విరమించుకొని..ఆ తర్వాత బాలుడు ఇంటికి వచ్చాక కిడ్నాప్ చేశారని పోలీసులు చెబుతున్నారు.

ఈనెల 3వ తేదీనే కిడ్నాపర్లు..రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. బాలుడు జషిత్ ఇంటి ముందు ఉన్న సత్యదేవ నిలయానికి ఇద్దరు వ్యక్తులు వచ్చినట్లు గుర్తించారు. ఎదురుగా ఉన్న అపార్ట్ మెంట్ లో బాలుడు రోజూ ఆడుకోవడానికి వస్తుంటాడని ముందుగానే గుర్తించి కిడ్నాప్ కి పక్కాగా ప్లాన్ వేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. త్వరలోనే కిడ్నాపర్లను పట్టుకొని బాబుని కాపాడతామని వారు చెబుతున్నారు.

బాలుడు తల్లిదండ్రులు ఇద్దరూ బ్యాంక్ ఉద్యోగులు కావడంతో ఆర్థిక లావాదేవీల్లో భాగంగా బాలుడిని కిడ్నాప్ చేశారని మొదట అనుమానించారు. అయితే.. ఇప్పటి వరకు కిడ్నాపర్ల నుంచి ఎలాంటి బెదిరింపులు కూడా రాకపోవడం గమనార్హం. 

click me!
Last Updated Jul 24, 2019, 12:22 PM IST
click me!