ప్రవీణ్ ఆమరణ నిరాహార దీక్ష భగ్నం

First Published Jan 22, 2017, 1:03 PM IST
Highlights

ఏ రాజకీయ పార్టీ కూడా కడప ఉక్కు గురించి ఆలోచించలేనపుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి  ఆమరణ నిరాహార దీక్షచేపట్టి అంతా స్టీల్ ప్లాంట్ గురించి  ఆలోచించేలా చేశాడు

 ప్రొద్దుటూరులో ఉక‍్కు ఫ్యాక్టరీనెలకొల్పాలని నాలుగు రోజులుగా సాగుతున్న స్టీల్ ప్లాంట్ సాధన సమితి అధ్యక్షుడు  ప్రవీణ్‌కుమార్‌ రెడ్డి ఆమరణ  దీక్షను పోలీసులు ఆదివారం ఉదయం భగ్నం చేశారు.  ఆయన దీక్ష నేడు అయిదో రోజుకు చేరింది. అయితే,పోలీసులు పొద్దున కార్యకర్తలు ఎవరూ లేని సమయంలో వచ్చిఆయన్ను అరెస్ట్‌ చేసి కడప తీసుకెళ్లారు.  రిమ్స్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స ప్రారంభించారు.



 అయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలియగానే ప్రొద్దుటూరు కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. అటూవైపు ఆస్పత్రిలో డాక్టర్లు ఆయనకు వైద్యం అందిస్తుండగా,  ఇక్కడ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి కుటుంబసభ్యులు దీక్ష కొనసాగిస్తున్నారు.  ఇది ఇలా ఉంటే, ప్రవీణ్ కుమార్ రెడ్డి అక్రమ అరెస్టుకు నిరసనగా ప్రభత్వ ఆర్ట్స్ కళాశాల ముఖద్వారం ముందర అర్ద నగ్న   ప్రదర్శనకు పూనుకున్నారు. ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం చేశారు.దహానం చేయడం జరిగింది.రాయలసీమల్లో కరువుతో చావాల,

 

రాయలసీమల్లో వలసలతో చావలా రాయలసీమల్లో నిరుద్యోగంతో చావలా, పోరాటం చెయకూడదా..అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. పోరాటాలను, నిరసనలను   అణగదొక్కుతన్న ప్రభుత్వ విధానాలను  వారు ఖండించారు. రాయలసీమ హక్కులు అడగకూడదా.. విభజన చట్టంలో ఉక్కు గురించి అడగకూడదా....గుంతకల్లును రైల్వేజోన్ అడగకూడదా..శ్రీభాగ్ ఒప్పందం అమలు చేయాలనీ అడగకూడదా అని ప్రశ్నించారు.

 

మరి అదే విభజన చట్టంలో ఉక్కుంది కదా మరి కడప ఉక్కు ఆంధ్రుల హక్కు అయినా ఒక్క రాజకీయ పార్టీకి  కూడా ఈ విషయం పట్టకపోయినా, ప్రవీణ్ కుమార్ రెడ్డి ఒన్ మాన్ అర్మీగా ముందకు వచ్చాడని ,ఆయన తమ  మద్ధతు ఎపుడూ ఉంటుందని విద్యార్థులు తెలిపారు.

 

 

click me!