విజయవాడ గ్యాంగ్‌వార్‌లో ట్విస్ట్: సందీప్, పండూ గ్యాంగ్‌లకు నగర బహిష్కరణ

Published : Jun 15, 2020, 10:55 AM ISTUpdated : Jun 22, 2020, 06:54 AM IST
విజయవాడ గ్యాంగ్‌వార్‌లో ట్విస్ట్: సందీప్, పండూ గ్యాంగ్‌లకు నగర బహిష్కరణ

సారాంశం

విజయవాడ గ్యాంగ్‌వార్ ఘటనపై పోలీసులు కఠిన నిర్ణయం తీసుకొన్నారు. గ్యాంగ్‌వార్‌ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నగర బహిష్కరణ చేస్తున్నట్టుగా పోలీసులు సోమవారం నాడు ప్రకటించారు.


విజయవాడ: విజయవాడ గ్యాంగ్‌వార్ ఘటనపై పోలీసులు కఠిన నిర్ణయం తీసుకొన్నారు. గ్యాంగ్‌వార్‌ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నగర బహిష్కరణ చేస్తున్నట్టుగా పోలీసులు సోమవారం నాడు ప్రకటించారు.

గత నెల 30వ తేదీన విజయవాడ పటమటలో సందీప్, పండు అలియాస్ మణికంఠ గ్యాంగ్‌లు ఘర్షణకు దిగాయి. ఈ ఘర్షణలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సందీప్ ఈ గత నెల 31వ తేదీన మరణించారు.

ఈ ఘర్షణలో పాల్గొన్న పండు జీజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. పోలీసులు ఆయనను రెండు రోజుల క్రితం అరెస్ట్ చేశారు.

also read:బెజవాడలో గ్యాంగ్‌వార్‌: రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం, కదలికలపై నిఘా

విజయవాడ గ్యాంగ్ వార్ ఘటనను పోలీసులు తీవ్రంగా తీసుకొన్నారు.  సందీప్, పండు గ్యాంగ్ వార్ ల ఘటనలో ఇప్పటికే రెండు గ్యాంగ్ లకు చెందిన 37 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా 13 మంది నిందితులు పరారీలో ఉన్నారు. మణికంఠ తల్లిపై కూడ పోలీసులు కేసు నమోదు చేశారు. 

ఈ ఘటనకు కారణమైన భూ యజమానులు ప్రదీప్ రెడ్డి, శ్రీధర్ లతో పాటు  వీరిద్దరి మధ్య రాజీ చేసేందుకు సందీప్, పండు గ్యాంగ్ లను ఆశ్రయించిన నాగబాబులను  ఈ నెల 14వ తేదీ రాత్రి విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ రెండు గ్యాంగ్‌ల్లో ఉన్న వారిని నగరం నుండి బహిష్కరిస్తున్నట్టుగా డీసీపీ ప్రకటించారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్