పవన్ తుని పర్యటన: మొదట వద్దని.. తర్వాత ఓకే అన్న పోలీసులు

Siva Kodati |  
Published : Jan 08, 2021, 08:48 PM IST
పవన్ తుని పర్యటన: మొదట వద్దని.. తర్వాత ఓకే అన్న పోలీసులు

సారాంశం

తూర్పుగోదావరి జిల్లాలో రేపు జనసేన అధినేత, సినీనటుడు పవన్‌కల్యాణ్ పర్యటనకు పోలీసులు అనుమతించారు. తొలుత అనుమతి నిరాకరించినా ఆ తర్వాత జనసేన నేత నాదెండ్ల మనోహర్‌కు జిల్లా ఎస్పీ నయీమ్‌ అస్మీ ఫోన్‌ చేశారు

తూర్పుగోదావరి జిల్లాలో రేపు జనసేన అధినేత, సినీనటుడు పవన్‌కల్యాణ్ పర్యటనకు పోలీసులు అనుమతించారు. తొలుత అనుమతి నిరాకరించినా ఆ తర్వాత జనసేన నేత నాదెండ్ల మనోహర్‌కు జిల్లా ఎస్పీ నయీమ్‌ అస్మీ ఫోన్‌ చేశారు. పవన్‌ పర్యటనకు అనుమతిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు నాదెండ్ల మనోహర్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.    

తుని నియోజకవర్గంలోని తొండంగి మండలం వలసపాకలులో దివిస్‌ పరిశ్రమ ఏర్పాటును నిరసిస్తూ స్థానికులు గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు. వీరికి మద్దతు తెలిపేందుకు అక్కడ పర్యటించాలని పవన్‌ నిర్ణయించారు.

అయితే ఆ ప్రాంతంలో 144 సెక్షన్ అమలులో ఉన్నందున ఆయన పర్యటనకు అనుమతి లేదని ఎస్పీ ప్రకటించారు. శాంతిభద్రతల సమస్య వస్తుందనే ఉద్దేశ్యంతోనే తాము అనుమతి నిరాకరించినట్లు చెప్పారు.

ఈ క్రమంలో పవన్‌ స్పందించారు. తుని పర్యటన కోసం రేపు రాజమండ్రి వస్తున్నట్లు ఆయన ట్వీట్‌ చేశారు. ఆ వెంటనే పవన్‌ పర్యటనకు అనుమతిస్తున్నట్లు జిల్లా ఎస్పీ.. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌కు ఫోన్‌ చేసి చెప్పారు. దీంతో పవన్‌ రేపటి తుని పర్యటనపై ఉత్కంఠకు తెరపడింది. 
 

PREV
click me!

Recommended Stories

Machiraju Venugopal Rao Ugadi: పరాభవ నామ సంవత్సరంలో ఈ రాశులవారికి జరిగేది ఇదే| Asianet News Telugu
Divyang Shakti:బస్సులో లోకేష్ పై చంద్రబాబు పంచులకి పడి పడి నవ్విన పవన్ కళ్యాణ్ | Asianet News Telugu