అనంతపురంలో దారుణం.. 12ఏళ్ల బాలికపై అత్యాచారం..!

Published : Sep 11, 2021, 07:40 AM IST
అనంతపురంలో దారుణం.. 12ఏళ్ల బాలికపై అత్యాచారం..!

సారాంశం

బాలికను కొంతకాలంగా అనుసరిస్తున్న రమేష్.. శుక్రవారం ఆమె బహిర్భూమికి వెళ్లిన సమయంలో నిర్మానుష్య ప్రదేశంలో అత్యాచారానికి పాల్పడినట్లు బాధిత కుటుంబం ఫిర్యాదులో పేర్కొంది. 

అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. 12ఏళ్ల మైనర్ బాలిక పై ఓ వ్యక్తి అ ఘాయిత్యానికి పాల్పడ్డాడు. కాగా.. తనపై జరిగిన దాడిని బాలిక తన తల్లిదండ్రులకు వివరించింది. దీంతో.. వారు పోలీసులను ఆశ్రయించారు. బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడు రమేష్(42) పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బాలికను కొంతకాలంగా అనుసరిస్తున్న రమేష్.. శుక్రవారం ఆమె బహిర్భూమికి వెళ్లిన సమయంలో నిర్మానుష్య ప్రదేశంలో అత్యాచారానికి పాల్పడినట్లు బాధిత కుటుంబం ఫిర్యాదులో పేర్కొంది. రమేష్ గ్రామంలో నాటుసారా విక్రయిస్తూ జీవనం సాగిస్తుంటాడని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!