ప్రేమించిన యువతిపై దాడి.. వీడియో తీసి..వైరల్ చేసి..

Published : Sep 18, 2021, 11:29 AM IST
ప్రేమించిన యువతిపై దాడి.. వీడియో తీసి..వైరల్ చేసి..

సారాంశం

సుమారు మూడు నెలల కిందట మాట్లాడుకుందామని యువతిని కొత్తూరు సమీపంలోని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అమానుషంగా ప్రవర్తించాడు

తాను ప్రేమించిన అమ్మాయి.. తనను దూరం పెట్టడం తట్టుకోలేకపోయాడు. దీంతో.. ఆమెపై దాడి  చేశాడు. దానంతటినీ స్నేహితుడి సహాయంతో వీడియో తీశాడు. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట వైరల్ కావడం గమనార్హం. గంటల వ్యవధిలోనే ఇద్దరు నిందితులను  పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

ఈ సంఘటన నెల్లూరు జిల్లాలో  చోటుచేసుకోగా..  ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరు రామకోటయ్యనగర్‌కు చెందిన పల్లాల వెంకటేష్, కె.శివకుమార్‌ స్నేహితులు. వెంకటేష్‌ టిప్పర్‌ డ్రైవర్‌. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య అతనిని విడిచి వెళ్లిపోయింది.

ఈ నేపథ్యంలో వెంకటేష్‌ ఓ యువతితో సన్నిహితంగా ఉండేవాడు. అయితే అతని ప్రవర్తన నచ్చక ఆమె అతనిని దూరంగా ఉంచుతూ వచ్చింది. దీనిని అతను జీర్ణించుకోలేకపోయాడు. సుమారు మూడు నెలల కిందట మాట్లాడుకుందామని యువతిని కొత్తూరు సమీపంలోని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అమానుషంగా ప్రవర్తించాడు. కర్రతో, చేతులతో విచక్షణ రహితంగా దాడి చేశాడు. గాజులు పగిలి రక్తస్రావం అవుతున్నా కనికరించలేదు. బాధిత యువతి తనను వదిలేయాలని కన్నీటి పర్యంతమైనా పట్టించుకోకుండా దాడి చేస్తూ ఆ వ్యవహారాన్ని స్నేహితుడు శివకుమార్‌ ద్వారా వీడియో తీయించి పైశాచికానందం పొందాడు. అయితే ఈ ఘటనపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు.
 
మూడు నెలల అనంతరం బుధవారం వాట్సాప్, ట్విట్టర్, పలు చానళ్లలో యువతిని చిత్రహింసలు పెడుతున్న వీడియో వైరల్‌ అయింది. దీనిపై ఎస్పీ విజయారావు స్పందించి.. నిందితుల కోసం మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. సాంకేతికత సాయంతో వీడియోలోని నిందితులను గుర్తించి, తెగచర్లలో వారిని అరెస్ట్‌ చేశారు. నిందితులిద్దరిపై రౌడీషీట్లు తెరుస్తున్నట్టు ఎస్పీ తెలిపారు. ఏడు రోజుల్లోపు చార్జ్‌షీటు వేసి శిక్షపడేలా చేస్తామని చెప్పారు. గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్ట్‌ చేశారు. 

PREV
click me!

Recommended Stories

Paritala Sunitha Sensational Comments ON Thopudurthy Prakash Reddy | Asianet News Telugu
పరిటాల గడ్డపై నుండి జగన్ కు వార్నింగ్ | Nara Lokesh Fires On YS Jagan | Asianet News Telugu