డమ్మీ తుపాకీతో రియల్టర్ కు బెదిరింపులు..!

Published : Dec 11, 2020, 02:56 PM IST
డమ్మీ తుపాకీతో రియల్టర్ కు బెదిరింపులు..!

సారాంశం

ఈ క్రమంలోనే రాజు హతమార్చడానికి లోవరాజుకు సంతోష్  సుపారీ ఇచ్చాడు. కాగా చాకచక్యంగా రౌడీషీటర్ నుంచి తప్పించుకొన్న రియల్టర్ పీఎస్ రాజు దువ్వాడ పోలీసులను ఆశ్రయించారు.


విశాఖపట్నంలో రియల్టర్ పీఎస్ రాజును కత్తి, డమ్మీ పిస్టల్‌తో బెదిరించిన ఘటన నగరంలో చోటు చేసుకుంది.  రౌడీషీటర్లు సంతోష్, లోవరాజు కలిసి రియల్టర్‌ను గదిలో బంధించి రూ.9.60 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. గతంలో రియల్టర్ పీఎస్ రాజు కారణంగానే అరెస్ట్ అయ్యానంటూ సంతోష్  కక్షపెంచుకున్నాడు. 

ఈ క్రమంలోనే రాజు హతమార్చడానికి లోవరాజుకు సంతోష్  సుపారీ ఇచ్చాడు. కాగా చాకచక్యంగా రౌడీషీటర్ నుంచి తప్పించుకొన్న రియల్టర్ పీఎస్ రాజు దువ్వాడ పోలీసులను ఆశ్రయించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి కత్తి , డమ్మీ పిస్టల్, రూ.61 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

PREV
click me!

Recommended Stories

Journalists Arrest : జర్నలిస్టులను ఎందుకు అరెస్ట్ చేశారు.. అసలు ఏమిటీ వివాదం..?
Andhra pradesh: ఏపీలో మరో హైటెక్ సిటీ.. కాగ్నిజెంట్ కార్యకలాపాలు ప్రారంభం, మరిన్ని సంస్థలు