రూ.2కోట్లు ఎగ్గొట్టేందుకు చచ్చినట్లు నాటకమాడి...

By telugu teamFirst Published Nov 13, 2019, 8:08 AM IST
Highlights

తాను హత్యకు గురైనట్లు నాటకం ఆడితే ఆ నేరం శ్రీనివాసరావుపై పడుతుందని.. తాను చెల్లించాల్సిన  రూ.2కోట్లు కూడా ఎగ్గొట్టచ్చని అనుకున్నాడు. దీనిలో భాగంగా తనకు రావాల్సిన డబ్బుల కోసం ఫ్యాక్టరీ వద్దకు వెళ్తున్నట్లు గత 22న కుటుంబసభ్యులకు చెప్పి ఇంటి నుంచి బయలుదేరాడు.

రైతులకు రూ.2కోట్లు బకాయి పడ్డాయి. అవి తిరిగి ఇవ్వాల్సి వస్తుందని ఏకంగా చనిపోయినట్లు నాటకం ఆడాడు. తనను ఎవరో హత్య చేసినట్లు అందరినీ నమ్మించాడు. చివరకు పోలీసులకు చిక్కాడు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... కామరవపుకోట మండలం రామన్నపాలేనికి చెందిన వ్యాపారి సాయిదుర్గారావుకి ఏలూరు మండలం చొదిమెళ్ల సమీపంలోని మొక్కజొన్న ఫ్యాక్టరీ గోదాం యజమానికి శ్రీనివసరావు రూ.80లక్షల వరకు బాకీ ఉన్నారు. కాగా.. సాయిదుర్గారావు రైతులకు రూ.2కోట్లు చెల్లించాల్సి ఉంది. తనకు రావాల్సిన డబ్బులు రాలేదు.. తన దగ్గర రైతులకు చెల్లించడానికి డబ్బులు లేవు. దీంతో... ఆ అప్పు నుంచి తప్పించుకోవడానికి ఓపథకం వేశాడు.

తాను హత్యకు గురైనట్లు నాటకం ఆడితే ఆ నేరం శ్రీనివాసరావుపై పడుతుందని.. తాను చెల్లించాల్సిన  రూ.2కోట్లు కూడా ఎగ్గొట్టచ్చని అనుకున్నాడు. దీనిలో భాగంగా తనకు రావాల్సిన డబ్బుల కోసం ఫ్యాక్టరీ వద్దకు వెళ్తున్నట్లు గత 22న కుటుంబసభ్యులకు చెప్పి ఇంటి నుంచి బయలుదేరాడు.

అనంతరం కోడి రక్తాన్ని ఫ్యాక్టరీ గోదాం వద్దకు తీసుకువెళ్లి చల్లాడు. తన కళ్లజోడును కూడా అక్కడే పడేశాడు. బైక్ ని ఏలూరు కాలువలో పడేసి ఆపై అక్కడి నుంచి పరారయ్యాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు కేసు చిక్కుముడి ఎంత ప్రయత్నించినా వీడలేదు.

దీంతో  అతని కాల్ డేటాపై పోలీసులు దృష్టిపెట్టారు. దీంతో... అతను ఆడిన నాటకం బయటపడింది. మంగళవారం ఏలూరు శివారు జాతీయ రహదారి వద్ద సాయిదుర్గారావును పోలీసులు అరెస్టు చేసి.. కోర్టులో హాజరుపరిచారు. 

click me!