గుడివాడ ఆర్‌ఐపై హత్యయత్నం: పోలీసుల చర్యలు.. 9 మంది అరెస్ట్..

Published : Apr 23, 2022, 10:13 AM IST
 గుడివాడ ఆర్‌ఐపై హత్యయత్నం: పోలీసుల చర్యలు.. 9 మంది అరెస్ట్..

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లోని గుడివాడ మండలం మోటూరులో గురువారం అర్ధరాత్రి  దాటాక ఆర్‌ఐ అరవింద్‌పై దాడి ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి చర్యలు చేపట్టిన పోలీసులు.. 9 మందిని అరెస్ట్ చేశారు. 

ఆంధ్రప్రదేశ్‌లోని గుడివాడ మండలం మోటూరులో గురువారం అర్ధరాత్రి  దాటాక ఆర్‌ఐ అరవింద్‌పై దాడి ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకున్నందుకు ఆయనపై బెదిరింపులకు దిగడంతో పాటు.. భౌతిక దాడికి దిగింది. తాజాగా ఈ ఘటనపై పోలీసులు చర్యలు చేపట్టారు. ఆర్ఐ అరవింద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు  మొత్తం 10 మందిపై 353, 307 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటివరకు 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో గంటా లక్ష్మణరావు( వైసీపీ నాయకుడు గంటా సురేష్ తమ్ముడు), గంగిశెట్టి రాధాకృష్ణ, నాగేశ్వరరావు, మహేష్, రంగబాబు, ఏడుకొండలు, జితేంద్ర, సత్యనారాయణ ఉన్నాయి.  ఒక బాల నేరస్తుడిని అదుపులోకి తీసుకున్నట్టుగా పోలీసులు తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించి ఒక  జేసీబీ, 3 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ప్రభుత్వ  అధికారుల విధులకు ఆటంకం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కేసులో గంటా సురేష్‌ను అరెస్ట్ చేయాల్సి ఉందన్నారు. 

మోటారు గ్రామంలో అక్రమ మట్టి తవ్వకాలకు సంబంధించిన సమాచారం అందుకున్న ఆర్ఐ అరవింద్.. తహసీల్దార్ ఆదేశాలతో గురువారం అర్ధరాత్రి దాటాక అక్కడి చేరకున్నాడు. అయితే ఆయనను మట్టి తవ్వకాలు జరపుతున్నవారు అడ్డుకున్నారు. మట్టి తవ్వకాలు నిలిపి.. అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆర్‌ఐ అరవింద్ వారికి చెప్పారు. అయితే అవేమీ పట్టించుకోకుండా అక్కడున్నవారు మట్టి తవ్వకాలు కొనసాగించారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి కొడాలి నాని అనుచరుడు గంటా సురేష్ సూచన మేరకు అతని తమ్ముడు గంటా లక్ష్మణ్, గంగిశెట్టి రాధాకృష్ణతో పాటు మరికొందరు.. అరవింద్‌పై భౌతిక దాడికి దిగా హత్యాయత్నం చేశారు. చొక్కా చించేసి, జేసీబీతో తొక్కించడానికి యత్నించారు. అయితే అక్కడి నుంచి అరవింద్ పక్కకు తప్పుకోవడంతో ప్రమాదం తప్పింది.

ఇక, ఈ ఘటనపై అరవింద్ తహసీల్దార్‌కు సమాచారం అందించారు. దీంతో పలువురు వీఆర్వోలు అక్కడికి చేరుకున్నారు. అనంతరం పోలీసులు కూడా అక్కడి చేరుకున్నారు. ఈ ఘటనపై అరవింద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై స్పందించిన రెవెన్యూ సంఘాలు.. దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని కోరాయి. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని డిమాండ్ చేశాయి. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!