దేవినేని ఉమ చేతిలో మోసపోయాం... న్యాయం జరక్కుంటే ఆత్మహత్యే శరణ్యం: సజ్జలతో పోలవరం సబ్ కాంట్రాక్టర్లు

Arun Kumar P   | Asianet News
Published : Dec 07, 2021, 05:10 PM IST
దేవినేని ఉమ చేతిలో మోసపోయాం... న్యాయం జరక్కుంటే ఆత్మహత్యే శరణ్యం: సజ్జలతో పోలవరం సబ్ కాంట్రాక్టర్లు

సారాంశం

గత టిడిపి హయాంలో పోలవరం ప్రాజెక్ట్ పనులు చేపట్టి మోసపోయామని... దయచేసి తమకు రావాల్సిన బిల్లులు విడుదల చేసి న్యాయం చేయాలని సబ్ కాంట్రాక్టర్లు ప్రభుత్వ సలహాదారు సజ్జలను కోరారు. 

అమరావతి: గత తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో పోలవరం నిర్మాణం చేపట్టిన తాము తీవ్రంగా నష్టపోయామని 120 మంది సబ్ కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేసారు. మంగళవారం పోలవరం ప్రాజెక్ట్  సబ్ కాంట్రాక్టర్లంతా కలిసి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ని కలిసారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని... లేదంటే ఆత్మహత్యలే శరణ్యమంటూ సజ్జల ఎదుట సబ్ కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేసారు. 

టిడిపి (TDP) హయాంలో పోలవరం ప్రాజెక్ట్ (polavaram project) నిర్మాణ పనులను ట్రాన్స్ రాయ్ (trans roy) సంస్థ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సమయంలో సబ్ కాంట్రాక్టర్లుగా పనిచేసి మోసపోయామని 120 మంది సబ్ కాంట్రాక్టర్లు సజ్జలకు  ఫిర్యాదు చేసారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం - గత ప్రభుత్వంలో రూ.20 కోట్లకుపైనే ఖర్చు చేసినా బిల్లులు మంజూరు చేయలేదని తెలిపారు. అప్పటి నీటిపారుదల శాఖమంత్రి  దేవినేని ఉమామహేశ్వర రావు (devineni uma) చేతిలో తాము మోసపోయామని సబ్ కాంట్రాక్టర్లు ఆరోపించారు. 

గత టిడిపి ప్రభుత్వం చేసిన తప్పిదానికి ప్రస్తుతం ఆర్దికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సబ్ కాంట్రాక్టర్లు (polavaram sub contractors) ఆవేదన వ్యక్తం చేసారు. దయచేసి వెంటనే బిల్లులు మంజూరు చేసి తమను ఆదుకోవాలని సజ్జలకు విజ్ఞప్తి చేసారు. గతంలో ముఖ్యమంత్రి  వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ys jagan)ని కూడా కలిసి వినతిపత్రం అందచేసినట్లు బాధితులు గుర్తుచేసారు. 

Video  పోలవరంపై కామెంట్స్ పై ట్రోల్స్... స్ట్రాంగ్ కౌంటరిచ్చిన మంత్రి అనిల్ 

పోలవరం సబ్ కాంట్రాక్టర్ల సమస్యలు విన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల సానుకూలంగా స్పందించారు. మీ సమస్యను పరిష్కరించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తామని  సబ్ కాంట్రాక్టర్లు సజ్జల రామకృష్ణారెడ్డి హామీ ఇచ్చారు. 

పోలవరం ప్రాజెక్టును గత టిడిపి హయాంలో రెండు కంపనీలు చేపట్టాయి. మొదట  ట్రాన్స్ రాయ్ కంపెనీ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టింది. అయితే కొన్నేళ్ళ తర్వాత రాష్ట్రం ఇచ్చిన బడ్జెట్ లో ఈ ప్రాజెక్టు ను పూర్తి చేయలేమని చెప్పి తప్పుకుంది. దీంతో 2018లో నవయుగ కంపనీ పోలవరం నిర్మాణ పనులు చేపట్టింది. 

అయితే ట్రాన్స్ రాయ్ ప్రధాన కాంట్రాక్టర్ గా వుండగా కొందరు సబ్ కాంట్రాక్టర్లకు నిర్మాణ పనులు అప్పగించింది. కానీ నిర్మాణపనుల నుండి ట్రాన్స్ రాయ్ తప్పుకోవడంతో వీరు డైలమాలో పడ్డారు. అప్పటివరకు తాము ఖర్చుచేసిన కోట్ల రూపాయలు బిల్లుల కోసం ప్రభుత్వం చుట్టూ తిరుగుతూనే వున్నారు. అయినా బిల్లులు మంజూరు కాలేదు. ఈ క్రమంలోనే మరోసారి వైసిపి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న సజ్జలను కలిసి తమ సమస్యలను పరిష్కరించాలని సబ్ కాంట్రాక్టర్లు కోరారు. 

read more  Polavaram Project: నిర్ణీత గడువులోగా పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడం అసాధ్యం.. కేంద్రం

ఇక తాజాగాపోలవరం ప్రాజెక్టుకు (polavaram project) సంబంధించి పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం (union government) కీలక విషయాలను వెల్లడించింది. పోలవరం ప్రాజెక్టు నిర్ణీత గడువులోగా పూర్తి కావడం అసాధ్యమని కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ తెలిపింది. టీడీపీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్ (Kanakamedala Ravindra Kumar) అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చిన కేంద్ర జల్‌శక్తి సహాయమంత్రి బిశ్వేశ్వర తుడు (Bishweswar Tudu)ఈ విషయాన్ని తెలియశారు. పోలవరం పనులను వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. పలు కారణాల వల్ల పనుల్లో జాప్యం జరిగిందని వెల్లడించారు. 

‘2022 ఏప్రిల్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అయితే సాంకేతిక కారణాల వల్ల పనుల్లో జాప్యం జరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు బాధితులకు పునరావాసం, పరిహారంలో జాప్యం జరిగింది. కరోనా వల్ల పోలవరం నిర్మాణ పనుల్లోనూ జాప్యం జరిగింది. స్పిల్ వే చానల్ పనులు 88 శాతం పూర్తవగా, అప్రోచ్ చానల్ ఎర్త్ వర్క్ పనులు 73 శాతం పూర్తి అయ్యాయి. పైలెట్ చానల్ పనులు 34 శాతం మాత్రమే పూర్తయ్యాయి' అని జలశక్తి మంత్రిత్వశాఖ వెల్లడించింది. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్
Bus Accident : అల్లూరి జిల్లాలో ఘోరం.. బస్సు ప్రమాదంలో 15మంది మృతి