బాబుకు పోలవరం షాక్:కేంద్రానికి నవీన్‌ పట్నాయక్ లేఖ

First Published Jun 2, 2018, 5:56 PM IST
Highlights

బాబుకు షాక్

అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనులను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తే ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్  కేంద్రానికి శనివారం నాడు లేఖ రాశారు. వీలైనంత వేగంగా పోలవరం
ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని ఏపీ సర్కార్ చేస్తున్న ప్రయత్నాలకు నవీన్ లేఖ అడ్డంకులు కల్పిస్తోందా అనే అనుమానాలు కూడ లేకపోలేదు.


ఎన్డీఏ నుండి టిడిపి వైదొలిగిన తర్వాత రాజకీయంగా టిడిపిని ఇబ్బంది పెట్టేందుకు బిజెపి నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని టిడిపి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టుపై
కూడ  ఆరోపణలు చేసి ప్రాజెక్టును అడ్డుకొనే ప్రయత్నాలు చేస్తున్నారని టిడిపి నేతలు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.

2019 ఎన్నికల నాటికి పోలవరం ప్రాజెక్టు ద్వారా నీటిని అందించాలని అందిస్తామని చంద్రబాబునాయుడు చెబుతున్నారు. అయితే ఈ తరుణంలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ పోలవరం ప్రాజెక్టు పనులను నిలిపివేయాలంటూ కేంద్రానికి రాసిన లేఖ ప్రస్తుతం ప్రాధాన్యతను సంతరించుకొంది.  పోలవరం ప్రాజెక్టుపై తొలి నుండి ఒడిశా తీవ్ర అభ్యంతరలను వ్యక్తం చేస్తోంది.

ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఒడిశా తీవ్రంగా నష్టపోతోందని ఆ రాష్ట్రం అభిప్రాయపడుతోంది. 
 పోలవరం ప్రాజెక్టు పనులు తక్షణమే నిలిపివేసేలా చూడాలని కోరుతూ కేంద్ర పర్యావరణ శాఖ
మంత్రి హర్షవర్థన్‌కు ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌  లేఖ రాశారు. ముంపు, పునరావాసం అంశాలు తేలేవరకు పనులను కొనసాగించవద్దని ఆయన లేఖలో కోరారు.


  పోలవరం నిర్మాణం వల్ల  ఒడిశా ఎదుర్కుంటోన్న సమస్యలు పరిష్కారం కావాల్సి  ఉందని, ప్రాజెక్టు పూర్తయితే ఒడిశా వాసులు శాశ్వతంగా నష్టపోతారని ఆయన పేర్కొన్నారు. ఇదే అంశంపై గతంలోనూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రెండు సార్లు లేఖలు రాశామని చెప్పారు.        

click me!