పొదలకూరులో కామపిశాచి.. లోన్ కావాలంటే కోరిక తీర్చాల్సిందే...!! (వీడియో)

Published : Jul 03, 2021, 05:08 PM IST
పొదలకూరులో కామపిశాచి.. లోన్ కావాలంటే కోరిక తీర్చాల్సిందే...!! (వీడియో)

సారాంశం

నెల్లూరు జిల్లాలో మరో కామాంధుడి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పొదలకూరులో ప్రముఖ బ్యాంకు మేనేజర్ నగేశ్  అసభ్యంగా ప్రవరిస్తూ మహిళల్ని వేధింపులకు గురి చేస్తున్నాడు. బ్యాంకులోనే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. లోన్లు కోసం వచ్చే వారిని ఆశపెట్టి, భయపెట్టి బ్యాంకు మేనేజర్ నగేశ్ లొంగ తీసుకుంటున్నట్లు సమాచారం.  

"

నెల్లూరు జిల్లాలోని పొదలకూరులో ఈ ఘటన జరిగింది. రుణం కావాలంటే తనకు లొంగిపోవాలని ఎస్బీఐ మేనేజర్ నగేష్ ఒత్తిడి పెట్టి మహిళా ఖాతాదారులను లోబరుచుకుంటున్నాడు. అతని రాసలీలలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. గడువులోగా రుణాలు చెల్లించకపోతే మహిళా ఖాతాదారులను లైంగికంగా అతను వేధిస్తున్నట్లు బయటపడింది. 
మహిళలను తన గదిలోకి పిలిచి వారి ఆర్థికావసరాలను ఆసరా చేసుకుని శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నట్లు చెబుతున్నారు. ఒంటరిగా మహిళలు బ్యాంక్ మేనేజర్ గదిలోకి వెళ్లడానికే భయపడుతున్నారు. మహిళల ఫోన్ నెంబర్లు తీసుకుని వారిని వేధిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. సీసీటీవి కెమెరాలోని దృశ్యాలు మీడియా చానెల్స్ లో రావడంతో నగేష్ దొంగ మాదిరిగా బ్యాంక్ నుంచి వెళ్లిపోయాడు. 

వీడియో ఆధారంగా అతనిపై పోలీసులు కేసు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. పరారీలో ఉన్న నగేష్ ను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లుగా కూడా తెలుస్తోంది.

PREV
click me!

Recommended Stories

Nimmala Ramanaidu Highlights Rayalaseema Irrigation Projects & Water Disputes | Asianet News Telugu
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం పొంచివుందా..? ఈ ప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు