పామర్రులో అమానుషం... మైనర్ బాలికను లోబర్చుకుని తల్లినిచేసిన దుర్మార్గుడు (వీడియో)

Published : Mar 23, 2023, 03:55 PM IST
పామర్రులో అమానుషం... మైనర్ బాలికను లోబర్చుకుని తల్లినిచేసిన దుర్మార్గుడు (వీడియో)

సారాంశం

మైనర్ బాలికను ప్రేమ పేరుతో నమ్మించి లోబర్చుకుని తల్లినిచేసాడో దుర్మార్గుడు. బాధిత బాలిక తల్లి ఫిర్యాదు మేరకు ఆ దుర్మార్గుడపై పామర్రు పోలీసులు పోక్సో కేసు నమోదు చేసారు. 

గుడివాడ : ప్రేమిస్తున్నానని వెంటపడుతూ కొందరు ఆకతాయిలు అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్నారు. ఇలాంటి ఘటనే కృష్ణా జిల్లాలో పామర్రులో వెలుగుచూసింది. మైనర్ బాలికను ప్రేమిస్తున్నానని నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడో యువకుడు. దీంతో బాలిక గర్భం దాల్చి పెళ్లికి ముందే మగ బిడ్డకు జన్మనిచ్చింది. 

బాధిత బాలిక తల్లి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పామర్రు మండలం కొమరవోలు గ్రామంలో మరియమ్మ కుటుంబంతో కలిసి నివాసముంటోంది.ఆమె మైనర్ కూతురు శివకుమారి(15) పై అదే గ్రామానికి చెందిన నాగ గోవింద్ కన్నుపడింది. మాయమాటలతో బాలికను ప్రేమిస్తున్నానని నమ్మించి లొంగదీసుకున్నాడు. గోవింద్ ను పూర్తిగా నమ్మిన బాలిక శారీరకంగా కూడా దగ్గరయ్యింది. ఇలా పలుమార్లు గోవింద్ తో శారీరకంగా దగ్గరవడంతో బాలిక గర్భం దాల్చింది. 

శివకుమారి కడుపు నొప్పితో బాధపడుతుండటంతో తల్లి మరియమ్మ హాస్పిటల్ కు తీసుకెళ్లగా గర్భం దాల్చినట్లు బయటపడింది. మార్చి 11న బాలిక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇంత జరిగినా తల్లినిచేసిన గోవింద్ బాలికను పెళ్ళి చేసుకోడానికి అంగీకరించడం లేదు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని మరియమ్మ తన కూతురికి న్యాయం చేయాలని కోరుతూ స్థానిక పోలీసులను ఆశ్రయించింది. 

వీడియో

తన బిడ్డ మానానికి వెలకడుతూ ఎన్ని డబ్బులైనా ఇస్తాను... పెళ్ళి మాత్రం చేసుకోనని గోవింద్ అంటున్నాడని ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది.మోసపోయిన కూతురితో కలిసి మరియమ్మ ఫిర్యాదు చేయగా స్పందించిన పామర్రు పోలీసులు నాగ గోవింద్ పై ఫోక్సో చట్టంతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. మైనర్ బాలికను మోసం చేసిన గోవింద్ కు తగిన శిక్ష పడేలా చూస్తామని పోలీసులు  తెలిపారు.  

PREV
click me!

Recommended Stories

AP Minister Ramprasad Reddy Lays Foundation for ₹19 Crore Works in Vijayawada | Asianet News Telugu
APCPDCL హెడ్ఆఫీస్ప్రారంభంలోMinister Gottipati Ravi Kumar | APCPDCL Head Office | Asianet News Telugu