జగన్ పై ప్రధాని మోదీ సోదరుడి ప్రశంసలు

Published : Jan 06, 2020, 10:28 AM ISTUpdated : Jan 06, 2020, 11:51 AM IST
జగన్ పై ప్రధాని మోదీ సోదరుడి ప్రశంసలు

సారాంశం

 తువతిలకుల సత్రంలో ధనుర్మాస వేడుకల్లో పాల్గొని విశేష పూజలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన సీఎం జగన్ పై ప్రశంసలు కురిపించారు. జగన్.... ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి అంటూ కొనియాడారు.   

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ పై ప్రధాని నరేంద్రమోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో ఆదివారం రాష్ట్రస్థాయి దేవతిలకుల, గాండ్ల, తెలకుల సంఘ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన స్థానిక తువతిలకుల సత్రంలో ధనుర్మాస వేడుకల్లో పాల్గొని విశేష పూజలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన సీఎం జగన్ పై ప్రశంసలు కురిపించారు. జగన్.... ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి అంటూ కొనియాడారు. 

AlsoReadరాజధాని సెగ: జనవరి 7న భేటీకానున్న హైలెవల్ కమిటీ...

రాష్ట్రంలో దేవతిలకులు, గాండ్ల, తెలకులు 14 లక్షలకు పైగా ఉన్నారన్నారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన వీరు ఆర్థిక, రాజకీయ రంగాల్లో పూర్తిగా వెనుకబడి ఉన్నారన్నారు. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని ఈ సామాజిక వర్గీయులంతా ఏకతాటిపై నిలిచి అన్ని రకాలుగా అభివృద్ధి సాధించాలని సూచించారు. ఈ సామాజిక వర్గీయుల సమస్యలను త్వరలో సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : తెలంగాణపై చలి పంజా.. ఈ జిల్లాల్లో వచ్చే పదిరోజులు అత్యల్ప ఉష్ణోగ్రతలు
Scrub Typhus : తెలుగు రాష్ట్రాల్లో కొత్త వ్యాధి.. ఏమిటిది, ఎలా సోకుతుంది, లక్షణాలేంటి?