నా తమ్ముడిలాంటి వ్యక్తి సమాజానికి ప్రమాదం, ఎన్ కౌంటర్ చేయండి: కిడ్నాపర్ రవిశంకర్ సోదరుడు

By Nagaraju penumalaFirst Published Jul 27, 2019, 2:50 PM IST
Highlights

విజయవాడలో జైలు నుంచి కోర్టుకు తరలిస్తుండగా ఎస్కార్ట్‌ సిబ్బంది కళ్లుగప్పి తప్పించుకొని పారిపోయాడు. రెండు నెలల నుంచి పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నాడు రవి శంకర్. ఆటో మొబైల్‌ దొంగతనాలు, చీటింగ్‌, ఉద్యోగాల పేరుతో ప్రజలను మోసం చేయడంలో రవిశంకర్ సిద్ధహస్తుడు.

కంకిపాడు: కిడ్నాపర్ రవిశంకర్ కనిపిస్తే ఎన్ కౌంటర్ చేసి చంపేయాలని ఆయన సోదరుడు వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. చిన్నప్పటి నుంచి రవిశంకర్ మోసాలకు పాల్పడుతుండటం సహజంగా అలవాటుగా చేసుకున్నాడని ఆరోపించారు. 

హయత్ నగర్ లోని సోని అనే యువతిని కిడ్నాప్ చేశాడు రవిశంకర్. నాలుగురోజులుగా అతడి గురించి ఆరా తీస్తున్నారు పోలీసులు.ఈ నేపథ్యంలో విచారణ నిమిత్తం అతని సొంతూరు విజయవాడలోని కంకిపాడుకు వెళ్లారు పోలీసులు. 

తన సోదరుడు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశాడని విషయం తెలుసుకున్న సోదరుడు వెంకటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనతోపాటు తన తమ్ముడు రవిశంకర్ చదువుకున్నాడని అయితే ఏడో తరగతి నుంచి చెడుసావాలు చేసి మోసాలకు పాల్పడుతుండే వాడని చెప్పుకొచ్చారు. తాము ఎన్నోసార్లు చెప్పినా వినేవాడు కాదని స్పష్టం చేశారు. 

ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయడం క్షమించరాని నేరమని స్పష్టం చేశారు. ఆ యువతికి ఏమీ కాకూడదని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు. తన సోదరుడు వల్ల సమాజానికి, తమ కుటుంబానికి నష్టం అని అలాంటి వారికి కట్టిన శిక్షలు వేయాలని కోరారు. 

ఈ కేసుకు సంబంధించి తన సోదరుడు రవిశంకర్ కుమారుడిని పోలీసులు విచారణ పేరుతో వేధించవద్దని వెంకటేశ్వరరావు సూచించారు. రవిశంకర్ తమ గ్రామానికి వచ్చి ఏడేళ్లు అయ్యిందని తన భార్య చనిపోయినప్పుడు మాత్రమే వచ్చాడని ఆ తర్వాత ఇప్పటి వరకు రాలేదన్నారు. 

రవిశంకర్ కు కుమారుడు, కుమార్తె ఉన్నారని వారిని అసలు పట్టించుకోలేదని వారి బాగోగులు తానే చూసుకుంటున్నట్లు సోదరుడు వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. తన సోదరుడు కనిపిస్తే కాల్చిపారేయండని తాను ఎలాంటికేసులు పెట్టనని, పోలీస్ శాఖను ప్రశ్నించనని చెప్పుకొచ్చారు. 
 
ఇకపోతే రవిశంకర్ పై వైజాగ్‌, విజయవాడ, కర్ణాటక ప్రాంతాలలో 50కి పైగా కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. విజయవాడలో జైలు నుంచి కోర్టుకు తరలిస్తుండగా ఎస్కార్ట్‌ సిబ్బంది కళ్లుగప్పి తప్పించుకొని పారిపోయాడు. 

రెండు నెలల నుంచి పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నాడు రవి శంకర్. ఆటో మొబైల్‌ దొంగతనాలు, చీటింగ్‌, ఉద్యోగాల పేరుతో ప్రజలను మోసం చేయడంలో రవిశంకర్ సిద్ధహస్తుడు. ఈనెల 23న హయత్ నగర్ కు చెందిన సోనీ అనే యువతిని రవిశంకర్ కిడ్నాప్ చేశాడు. 

click me!