పీలేరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

Siva Kodati |  
Published : Mar 25, 2024, 07:49 PM ISTUpdated : Mar 25, 2024, 07:50 PM IST
పీలేరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

సారాంశం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చల్లా ప్రభాకర్ రెడ్డి వంటి నేతలు పీలేరు నుంచే ప్రాతినిథ్యం వహించారు. దాదాపు 5 దశాబ్లాలుగా నల్లారి కుటుంబం పీలేరు నుంచే రాజకీయాలు కొనసాగిస్తోంది. నల్లారి అమర్‌నాథ్ రెడ్డి.. పీవీ నరసింహారావు కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి.. ఎమ్మెల్యేగా, చీఫ్ విప్‌గా, స్పీకర్‌గా , సీఎంగా సేవలందించారు. ఆయన సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి మాత్రం టీడీపీలో చేరి యాక్టీవ్‌గా వుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ.. 7 సార్లు, టీడీపీ 3 సార్లు, వైసీపీ, కేఎల్‌పీలు రెండు సార్లు, సీపీఐ ఒకసారి విజయం సాధించాయి.  పీలేరులో హ్యాట్రిక్ నమోదు చేయాలని సీఎం వైఎస్ జగన్ పట్టుదలతో వున్నారు. 

చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం .. ఈ పేరు వినగానే ఉద్ధండులు గుర్తొస్తారు. దేశానికి హేమాహేమీలైన నేతలను ఈ సెగ్మెంట్ అందించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చల్లా ప్రభాకర్ రెడ్డి వంటి నేతలు పీలేరు నుంచే ప్రాతినిథ్యం వహించారు. ఈ నియోజవర్గంపై నల్లారి కుటుంబం పట్టు ఎక్కువ. ప్రజలను పేరు పెట్టి మరీ మాట్లాడేంత చనువు వీరిది. దాదాపు 5 దశాబ్లాలుగా నల్లారి కుటుంబం పీలేరు నుంచే రాజకీయాలు కొనసాగిస్తోంది. 

పీలేరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 .. హేమాహేమీలను అందించిన గడ్డ :

నల్లారి అమర్‌నాథ్ రెడ్డి.. పీవీ నరసింహారావు కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి.. ఎమ్మెల్యేగా, చీఫ్ విప్‌గా, స్పీకర్‌గా , సీఎంగా సేవలందించారు. రాష్ట్ర విభజన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయంగా సైలెంట్ అయ్యారు. అయితే ఆయన సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి మాత్రం టీడీపీలో చేరి యాక్టీవ్‌గా వుంటున్నారు. రెడ్డి, ముస్లిం , శెట్టి బలిజ సామాజికవర్గాలదే పీలేరులో ఆధిపత్యం. 1955 ఎన్నికలు తప్పించి ఇప్పటి దాకా ఎమ్మెల్యేలుగా గెలిచినవారంతా రెడ్డి సామాజికవర్గానికి చెందినవారే . 

1952లో పీలేరు నియోజకవర్గం ఏర్పడగా.. కాంగ్రెస్ పార్టీ.. 7 సార్లు, టీడీపీ 3 సార్లు, వైసీపీ, కేఎల్‌పీలు రెండు సార్లు, సీపీఐ ఒకసారి విజయం సాధించాయి. పీలేరు నియోజకవర్గం పరిధిలో గుర్రంకొండ, వాల్మీకిపురం, పీలేరు, కలికిరి, కలకడ, కంభంవారిపల్లె మండలాలున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి చింతల రామచంద్రారెడ్డికి 87,300 ఓట్లు.. టీడీపీ అభ్యర్ధి ఎన్ కిశోర్ కుమార్ రెడ్డికి 79,426 ఓట్లు పోలయ్యాయి. దీంతో రామచంద్రారెడ్డి వరుసగా రెండోసారి పీలేరు నుంచి గెలిచారు. 

పీలేరు శాసనసభ ఎన్నికల ఫలితాలు 2024 .. మూడు దశాబ్థాలుగా గెలవని టీడీపీ :

2024 ఎన్నికల విషయానికి వస్తే.. పీలేరులో హ్యాట్రిక్ నమోదు చేయాలని సీఎం వైఎస్ జగన్ పట్టుదలతో వున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డికి మరోసారి టికెట్ కేటాయించారు. మంత్రి పెద్దిరెడ్డి వ్యూహాలకు తోడు కేడర్ బలంగా వుండటంతో మరోసారి గెలుస్తానని రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ విషయానికి వస్తే.. ఆ పార్టీ పీలేరులో గెలిచి మూడు దశాబ్ధాలు కావొస్తోంది. చివరిసారిగా 1994లో తెలుగుదేశం జెండా రెపరెపలాడింది.

కానీ ఈసారి మాత్రం పీలేరులో గెలవాలని చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డికి టికెట్ కేటాయించారు. వరుసగా రెండు సార్లు ఓడిపోయిన సానుభూతితో పాటు ఇప్పుడు జనసేనతో పొత్తు తెలుగుదేశానికి కలిసొస్తుందని భావిస్తున్నారు. పీలేరులో కాపు సామాజికవర్గం కూడా బలంగా వుండటంతో ఆ ఓట్లు టీడీపీకి పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

భార్య కోరిక తీర్చిన పవన్ మురిసిపోయిన అన్నా లెజినోవా | Pawan Kalyan Buys Doll for Wife Anna Konidela
తండ్రి - కొడుకుల ఆరా : CM Chandrababu | Minister Nara Lokesh | Nara Bhuvaneswari | Asianet Telugu