
అమరావతి చట్టబద్ధత పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందని వైయస్ఆర్‌సీపీ నేత పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీలో గంటల తరబడి జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు చేయడమే ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు. కేవలం అసెంబ్లీ తీర్మానం ద్వారా అమరావతికి చట్టబద్ధత రాదని, శాసనమండలి ఆమోదం అవసరమని ప్రశ్నించారు.