వర్క్ ఫ్రం హోంకి అవకాశం కల్పించాలని ఏపీ సచివాలయ ఉద్యోగులు సోమవారం నాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతిపత్రం సమర్పించారు.
అమరావతి: వర్క్ ఫ్రం హోంకి అవకాశం కల్పించాలని ఏపీ సచివాలయ ఉద్యోగులు సోమవారం నాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతిపత్రం సమర్పించారు.మూడు రోజుల వ్యవధిలో నలుగురు సచివాలయ ఉద్యోగులు మరణించారు. మరో 40 నుండి 50 మంది ఉద్యోగులు కరోనాతో హోం ఐసోలేషన్ లో ఉన్నారని సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలు ఈ సందర్భంగా గుర్తు చేశారు.
also read ఏపీ సచివాలయంలో కరోనా కలకలం... మరో మహిళా ఉద్యోగి మృతి
undefined
also read:కరోనా కల్లోలం: కోవిడ్ తో ఏపీహైకోర్టులో ఇద్దరు ఉద్యోగుల మృతి
కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో సచివాలయానికి వచ్చి విధులు నిర్వహించలేమని ఉద్యోగ సంఘాల నేతలు చెప్పారు. ఇంటి నుండే పనిచేసుకొనే అవకాశం కల్పించాలని ఉద్యోగ సంఘాల నేతలు సీఎస్ ను కోరారు.కరోనా కేసుల రోజు రోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో ఉద్యోగులంతా భయంతో విధులు నిర్వహిస్తున్నారని ఉద్యోగుల సంఘం నేతలు బొప్పరాజు, వెంకట్రామ్ రెడ్డి లు చెప్పారు. వర్క్ ఫ్రం హోమ్ కి అవకాశం కల్పిస్తే కరోనా వైరస్ చైన్ ను బ్రేక్ చేసే అవకాశం ఉంటుందని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు.