. ఈ ఎన్నికల్లో తమ పార్టీ ఓటమి పాలైందనే విషయం ఇప్పటికే వైసీపీ నేతలకు అర్థమైపోయింది. అందుకే.. రోజా కూడా ఎక్స్( గతంలో ట్విట్టర్) లో ముందుగానే తన ఓటమిని అంగీకరిస్తూ.. ట్వీట్ చేయడం విశేషం.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ గెలుపు దాదాపు ఖాయం అయిపోయింది. అత్యధిక సీట్లలో టీడీపీ ఆధిక్యంలో ఉంది. చాలా మంది వైసీపీ నేతలు వెనకంజలో పడిపోయారు. అలా వెనకంజలో ఉన్న వారిలో.. రోజూ కూడా ఉన్నారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ ఓటమి పాలైందనే విషయం ఇప్పటికే వైసీపీ నేతలకు అర్థమైపోయింది. అందుకే.. రోజా కూడా ఎక్స్( గతంలో ట్విట్టర్) లో ముందుగానే తన ఓటమిని అంగీకరిస్తూ.. ట్వీట్ చేయడం విశేషం.
A powerful person is someone who converts:
❝
fears into confidence, setbacks into comebacks, excuses into decisions, mistakes into learnings.❜ pic.twitter.com/9SWkGN3KJD
తాను నవ్వుతూ ఉన్న ఫోటోని ఆమె ట్విట్టర్ లో షేర్ చేశారు. దాని కింద ఆమె పెట్టిన కామెంట్ కూడా ఇప్పుడు వైరల్ గా మారింది. ‘ భయాన్ని విశ్వాసంగా, ఎదురు దెబ్బలను మెట్లుగా.. మన్నింపులను నిర్ణయాలుగా.. తప్పులను పాఠంగా నేర్చుకొని, మార్చుకునే వాళ్లే శక్తివంతమైన వ్యక్తులుగా మారతారు’ అని పేర్కొన్నారు. కాగా.. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ నుంచి నగరి అభ్యర్థిగా రోజా బరిలో నిలిచారు.
ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు నగరి అభ్యర్థి, మాజీ మంత్రి రోజా వెనకంజలో ఉన్నారు. ఈ స్థానంలో టీడీపీ అభ్యర్థి గాలి భాను ప్రకాశ్ 5,640 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.