పెదకూరపాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 live

Published : Jun 04, 2024, 09:53 AM ISTUpdated : Jun 05, 2024, 09:38 PM IST
పెదకూరపాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 live

సారాంశం

Pedakurapadu assembly elections result 2024: పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో ఆసక్తికర రాజకీయాలు సాగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు 2024లో  ఇరుపార్టీల మధ్య హోరాహోరీ పోరు ఖాయం.   సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా పనిచేసిన కన్నా లక్ష్మీనారాయణ, కొమ్మాలపాటి శ్రీధర్ లు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతుండటం ఆ పార్టీకి ప్లస్ అయితే... ప్రస్తుతం అధికారంలో వుండటం, గత ఎన్నికల్లో సత్తాచాటి  గెలవడం వైసిపికి ప్లస్. ఇలా ఇరుపార్టీలు గెలుపుపై ధీమాగా వుండటంతో పెదకూరపాడు ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. 

Pedakurapadu assembly elections result 2024: పెదకూరపాడు రాజకీయాలు చాలా విభిన్నం. మొదట కాంగ్రెస్, ఆ తర్వాత టిడిపికి కంచుకోటగా వున్న ఈ నియోజకవర్గం ఇప్పుడు వైసిపి చేతికి చిక్కింది. టిడిపి ఆవిర్భావం తర్వాత అల్లంశెట్టి విశ్వేశ్వరరావు, కాసరనేని సదాశివరావులు పెదకూరపాడులో గెలిచారు. ఆ తర్వాత ఈ నియోజకవర్గంలో కన్నా లక్ష్మీనారాయణ హవా సాగింది. ఆయన వరుసగా నాలుగుసార్లు (1989,94,99,2004) ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు.

ఇటీవలే కన్నా టిడిపిలో చేరి సత్తెనపల్లి నుండి పోటీకి సిద్దమయ్యారు. ఆయన చేరిక పెదకూరపాడులో టిడిపిలో జోష్ నింపింది.  ఇక ఇప్పటికే టిడిపి నుండి కొమ్మాలపాటి శ్రీధర్ రెండుసార్లు (2009,2014)  పెదకూరపాడు నుండి గెలిచారు. కానీ 2019 ఎన్నికల్లో టిడిపిని ఓడించి వైసిపి అభ్యర్థి నంబూరి శంకరరావు పెదకూరపాడు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 

పెదకూరపాడు అసెంబ్లీ పరిధిలోని మండలాలు: 

1బెల్లంకొండ
2క్రోసూరు
3అచ్చంపేట 
4అమరావతి 
5పెదకూరపాడు 


పెదకూరపాడు అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు :

పెదకూరపాడు వైసిపి అభ్యర్థి : 

సిట్టింగ్ ఎమ్మెల్యే నంబూరు శంకర్ రావు మరోసారి వైసిపి బరిలో నిలిచారు.  

పెదకూరపాడు టిడిపి అభ్యర్థి :

టిడిపి నుండి బాష్యం ప్రవీణ్ బరిలో నిలిాచారు 

పెదకూరపాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు :

పెదకూరపాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

పెదకూరపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుపొందింది.టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్‌ 112957 ఓట్లతో విజయం సాధించారు.

పెదకూరపాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019 : 

నియోజకవర్గంలోని మొత్తం ఓటర్లు 2,22,800

పోలయిన ఓట్లు 1,98,007

వైసిపి - నంబూరి శంకర రావు -99,577 (50 శాతం) - 14,104 ఓట్ల మెజారిటీతో విజయం 

టిడిపి - కొమ్మాలపాటి శ్రీధర్ - 85,473 (43 శాతం) - ఓటమి

జనసేన పార్టీ -పుట్టి సామ్రాజ్యం - 7,198 (4 శాతం)


పెదకూరపాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2014 : 

నియోజకవర్గంలో నమోదైన మొత్తం ఓట్లు 2,01,155

పోలయిన ఓట్లు 1,79,421 (89 శాతం) 

టిడిపి - కొమ్మాలపాటి శ్రీధర్ - 90,310 (50 శాతం) - 9,196 ఓట్ల మెజారిటీతో విజయం 

వైసిపి - బొల్లా బ్రహ్మనాయుడు ‌- 81,114 (45 శాతం) ‌- ఓటమి 

PREV
click me!

Recommended Stories

సాయికృష్ణ ఇంటికి వద్ద జగన్ సంచలన ప్రెస్ మీట్ | YS Jagan Sensational Press Meet at Sai Krishna House
కృష్ణలంకలో గాదె సాయికృష్ణ కుటుంబాన్ని పరామర్శించిన జగన్ | YS Jagan Visits Gade Sai Krishna Family