కదిరిపై పట్టు కోల్పోకూడదని గట్టి పట్టుదలతో వున్న ఏపీ సీఎం వైఎస్ జగన్.. సర్వేలు, ఇతర సమాచారం ఆధారంగా సిట్టింగ్ ఎమ్మెల్యే శిద్దారెడ్డికి టికెట్ నిరాకరించారు. ఆయనకు బదులుగా మైనార్టీ నేత మక్బూల్ భాషాను అభ్యర్ధిగా ప్రకటించారు జగన్.
అనంతపురం జిల్లా కదిరి.. ఈ పేరు చెప్పగానే లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కళ్లెదుట మెదులుతుంది. నవ నరసింహ ఆలయాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఆలయం ప్రహ్లాద సమేత లక్ష్మీనరసింహస్వామి దేవాలయం. ఖాద్రి నరసింహునిగా, కాటమ రాయుడిగా ఆయన పూజలందుకుంటున్నారు. ఆధ్యాత్మికంగానే కాదు.. రాజకీయంగానూ కదిరికి ఎంతో ప్రాధాన్యత వుంది. అనంతపురం జిల్లాలో కీలక పట్టణంగా కదిరి వెలుగొందుతోంది.
కదిరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 .. కాంగ్రెస్‌కు కంచుకోట :
1952లో ఏర్పడిన కదిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఇక్కడి నుంచి ఆ పార్టీ 7 సార్లు, టీడీపీ 3 సార్లు, వైసీపీ రెండు సార్లు, బీజేపీ ఒకసారి , ఇతరులు ఒకసారి విజయం సాధించారు. కదిరి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో తనకల్లు, నంబులికుంట, గండ్లపెంట, కదిరి, నల్లచెరువు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 2,39,867 మంది. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి డాక్టర్ శిద్ధా రెడ్డికి 1,02,432 ఓట్లు.. టీడీపీ అభ్యర్ధి కందికుంట వెంకట ప్రసాద్‌కు 75,189 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా వైసీపీ 27,243 ఓట్ల తేడాతో కదిరిలో విజయం సాధించింది.
కదిరి శాసనసభ ఎన్నికల ఫలితాలు 2024 .. హ్యాట్రిక్‌పై వైసీపీ కన్ను :
కదిరిపై పట్టు కోల్పోకూడదని గట్టి పట్టుదలతో వున్న ఏపీ సీఎం వైఎస్ జగన్.. సర్వేలు, ఇతర సమాచారం ఆధారంగా సిట్టింగ్ ఎమ్మెల్యే శిద్దారెడ్డికి టికెట్ నిరాకరించారు. ఆయనకు బదులుగా మైనార్టీ నేత మక్బూల్ భాషాను అభ్యర్ధిగా ప్రకటించారు జగన్. దీంతో శిద్ధారెడ్డి అసమ్మతి స్వరం వినిపించారు. పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా వుండటంతో మంత్రి పెద్దిరెడ్డి ఆయనను బుజ్జగించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
ఇక టీడీపీ విషయానికి వస్తే.. మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ కి చంద్రబాబు టికెట్ కేటాయించారు. జగన్ పాలనపై వ్యతిరేకత, స్థానిక వైసీపీలో గ్రూపులు, టీడీపీ జనసేన బీజేపీ కూటమి కారణంగా తన విజయం పక్కా అని యశోదా దేవి ధీమా వ్యక్తం చేస్తున్నారు. జనసేన నేతలు కూడా వెంకట ప్రసాద్ భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పడంతో టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.
కదిరిలో ఉన్న మండలాలు:
1. తనకల్లు
2. నంబులపూలకుంట
3. గాండ్ల పెంట
4. కదిరి
5. నల్లచెరువు
6. తలుపుల