ఓట్లు ఎత్తుకుపోతున్నారు.. టీడీపీ పై పవన్ ట్వీట్

Published : Nov 01, 2018, 04:19 PM IST
ఓట్లు ఎత్తుకుపోతున్నారు.. టీడీపీ పై పవన్ ట్వీట్

సారాంశం

చిన్న పిల్లల్ని ఎత్తుకెళ్లిపోయే గ్యాంగులు గురించి వింటాం.  ఓట్లు ఎత్తుకెళ్లిపోయే గ్యాంగులు ని  చూస్తున్నామని పవన్ టీడీపీని ఉద్దేశించి ట్వీట్ చేశారు,

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ నేతలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ట్విట్టర్ వేధికగా మండిపడ్డారు. టీడీపీ నేతలు ఓట్లు ఎత్తుకుపోతున్నారని పవన్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు.

‘‘చిన్న పిల్లల్ని ఎత్తుకెళ్లిపోయే గ్యాంగులు గురించి వింటాం.  ఓట్లు ఎత్తుకెళ్లిపోయే గ్యాంగులు ని  చూస్తున్నాం. మరి తెలుగుదేశం నాయకులు దీని గురించి ఏమి మాట్లాడతారని నేను ఎదురు చూస్తున్నాను.  Party leaders have taken the decision to lodge a complaint with ‘Election Commission.’ ’’ అంటూ పవన్ ట్వీట్ చేశారు.

ఓ ఇంగ్లీష్ ప్రతికలో టీడీపీ నేతలు ఓటర్ల జాబితాను ట్యాంపరింగ్ చేస్తున్నారంటూ వచ్చిన కథనాన్ని ఫోటో తీసి.. దానికి పైవిధంగా క్యాప్షన్ ఇచ్చి.. పవన్ ట్వీట్ చేశారు. మరి దీనిపై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి. 

 

PREV
click me!

Recommended Stories

సీఎం విజయ్ పై పవన్ పంచ్ లు పడిపడి నవ్విన జన సైనికులు | Deputy CM Pawan Kalyan| Asianet News Telugu
Pawan Kalyan Fun: నన్ను తిట్టిన యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయి: పవన్ జోకులు| Asianet News Telugu