ఊరుపేరు పేరుమార్పుకు సహకరిస్తా: పవన్ హామీ

Published : Feb 15, 2019, 05:14 PM IST
ఊరుపేరు పేరుమార్పుకు సహకరిస్తా: పవన్ హామీ

సారాంశం

 వాసవీ మాత అందరికీ స్ఫూర్తిగా నిలిచారన్నారు. వాసవీమాత ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆయన ఆకాంక్షించారు. తాను పెనుగొండకు ఆధ్యాత్మిక యాత్రగానే వచ్చానని రాజకీయాల కోసం కాదన్నారు. రాజకీయ నినాదాలు చేయవద్దని అభిమానులకు సూచించారు.   

పెనుగొండ : పెనుగొండను వాసవీ పెనుగొండగా మార్చాలన్న ప్రతిపాదనకు తాను సహరిస్తానని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. గురువారం పెనుగొండలోని వాసవీ మాత 90 అడుగుల పంచలోహ విగ్రహాష్కరణ వేడుకలకు హాజరైన పవన్ కళ్యాణ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 వాసవీ మాత అందరికీ స్ఫూర్తిగా నిలిచారన్నారు. వాసవీమాత ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆయన ఆకాంక్షించారు. తాను పెనుగొండకు ఆధ్యాత్మిక యాత్రగానే వచ్చానని రాజకీయాల కోసం కాదన్నారు. రాజకీయ నినాదాలు చేయవద్దని అభిమానులకు సూచించారు. 

ఈ సందర్భంగా ట్రస్ట్‌ చైర్మన్‌ డా.గోవిందరాజులు పెనుగొండను వాసవీ పెనుగొండగా పేరు మార్చేలా సహకరించాలని పవన్ కళ్యాణ్ ని  కోరారు. పెనుగొండ పేరుమార్పుకు తనవంతు సహకారం అందిస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు నేతలు ట్రస్ట్ సభ్యులు పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు.  
 
PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే