(ఆడియో) పవన్ 'నిరసన సంగీతం' అల్బం విడుదల

Published : Jan 24, 2017, 05:51 AM ISTUpdated : Mar 25, 2018, 11:55 PM IST
(ఆడియో) పవన్ 'నిరసన  సంగీతం' అల్బం విడుదల

సారాంశం

ఉత్తరాది కేంద్రం మెడలు వంచుతానంటున్న పవన్ కల్యాణ్ నిరసన సంగీతంతో ఉద్యమానికి సిద్ధమవుతున్నాడు

 

 

జనసేన అధినేత పవన​ కళ్యాణ్  ’నిరసన సంగీతం‘  వినిపిస్తున్నారు. ఈ రోజుఆయన ప్రొటెస్ట్ మ్యూజిక్ అల్బమ్  విడుదల చేశారు. ఎప్పటిలాగే  ట్విట్టర్ నుంచే ఆయన ఈ  అల్బం విడుదల చేశారు. 

 

ఉత్తరాది పెత్తన ’కేంద్రం‘ మెడలు వంచేందుకు సిద్ధం కావాలని పిలుపు నిచ్చిన 24 గంటలోపే ఆయన ఇపుడు ఈ నిరసన సంగీతం వినిపిస్తున్నారు.

 

ఇది ప్రజల నిరసన, జనసేన నిరసన-  మ్యూజికల్ ఆల్బం ద్వారా దీనిని వ్యక్తం చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.   ప్రత్యేక హోదా నినాదాన్ని ప్రజల్లో బలంగా నాటేందుకు  ఈ  ఆల్బమ్ ను విడుదల  చేస్తున్నట్టు కొద్ది సేపటి కిందట ట్విట్టర్లో ప్రకటించారు. అల్బమ్ కుసంబంధించిన ‘దేశ్ బచావో’ పోస్టర్ ను కూడా ట్టిట్టర్ లో పెట్టారు. మొత్తం ఆరుపాటలుంటాయి. ఇపుడు నాలుగు విడుదల చేస్తున్నారు. ఒకటి అందుబాటులోకి వచ్చింది(పైన). మిగతా వి ప్రతి 45నిమిషాలకొకటి విడుదలవుతాయని ఆయన  తెలిపారు.

 

. ఈనెల 26న విశాఖ ఆర్కేబీచ్ లో జరగబోయే నిరసన కార్యక్రమానికి ప్రతీ ఆంధ్రుడు ఓ సైనికుడై కదలి రావాలని ఆయన పిలుపునిచ్చారు.

 

ఈ రోజు విడుదల చేసిన ట్వీట్స్లో  ఆయన ప్రజాప్రతినిధులకు  కొన్ని విషయాలు జ్ఞప్తికి తీసుకువచ్చారు.

 

“నీ స్వేచ్ఛ కోసం ఎంత రక్తం పారిందో తెలుసుకో అది నీ శరీర క్షేత్రంలో ధైర్యంలో చల్లలేకపోతే అది నీ గుండెల్లో ఆత్మగౌరవం పండించలేకపోతే నీవు బానిసగానే ఉండిపోవడానికే నిర్ణయించుకుంటే.. ఎంత ద్రోహివిగా మారావు ఆ పవిత్ర రక్తానికి...”

 

“ మేము పూలగుత్తుల వ్రేలడే వసంత రుతువులం కాదు

వట్టి మనుష్యలం దేశం మాకు  గాయాలిచ్చినా నీకు

మేము పువ్వలిస్తున్నాం

ఒ  ఆశ చంద్రికలకుంభవృష్టి

కురిశే మిత్రమా

యోచించు ఏమితెస్తావో

మా ఆందరి కోసం

ఓటు అనే బోటు మీద”

 

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?