టార్గెట్ 2019: మేనిఫెస్టో విజన్ డాక్యుమెంట్ విడుదల చేసిన పవన్

By narsimha lodeFirst Published 14, Aug 2018, 1:23 PM IST
Highlights

జనసేన మేనిఫెస్టో‌ విజన్ డాక్యుమెంట్‌ను  ఆ పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ మంగళవారం నాడు పశ్చిమగోదావరి జిల్లాలో విడుదల చేశారు. వచ్చే ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేయనున్నట్టు ఆయన ప్రకటించారు. 


ఏలూరు: జనసేన మేనిఫెస్టో‌ విజన్ డాక్యుమెంట్‌ను  ఆ పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ మంగళవారం నాడు పశ్చిమగోదావరి జిల్లాలో విడుదల చేశారు. వచ్చే ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేయనున్నట్టు ఆయన ప్రకటించారు. 

పార్టీ సిద్దాంతాలను, మేనిఫెస్టో‌ను ఆయన  వేర్వేరుగా విడుదల చేశారు. ప్రీ మేనిఫెస్టోకు పవన్ కళ్యాణ్  పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని శ్రీసోమేశ్వరస్వామి దేవాలయంలో  దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రీ మేనిఫెస్టోలో  12 అంశాలను  పొందుపర్చారు. మరోవైపు  ఏడు సిద్దాంతాల  ఆధారంగా  తమ పార్టీ పనిచేస్తోందని  పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

అవినీతిపై రాజీలేని పోరాటాన్ని నిర్వహించనున్నట్టు ఆయన చెప్పారు. పర్యావరణాన్ని రక్షించేందుకు కులాలను  కలిపే ఆలోచన విధానం తమదని ఆయన చెప్పారు. మరో వైపు ప్రీ మేనిఫెస్టోలో 12 అంశాల్లో  పర్యావరణానికి పెద్ద పీట వేశారు. పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి కోసం తమ పార్టీ పనిచేస్తోందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
 

Last Updated 9, Sep 2018, 10:50 AM IST