ఏపీ కొత్త సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన అనిల్ చంద్ర పునేఠా

By sivanagaprasad kodatiFirst Published Sep 30, 2018, 5:19 PM IST
Highlights

ఆంధ్రప్రేదశ్ కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అనిల్ చంద్ర పునేఠా ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. 2019 మే 31 వరకు ఆయన సీఎస్‌గా కొనసాగుతారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఐఏఎస్‌గా 34 ఏళ్ల సర్వీస్‌ను పూర్తి చేశానన్నారు

ఆంధ్రప్రేదశ్ కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అనిల్ చంద్ర పునేఠా ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. 2019 మే 31 వరకు ఆయన సీఎస్‌గా కొనసాగుతారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఐఏఎస్‌గా 34 ఏళ్ల సర్వీస్‌ను పూర్తి చేశానన్నారు..

సీఎస్ పదవి ఛాలెంజింగ్ లాంటిదన్నారు. ప్రజల ఆర్థిక స్ధితి మెరుగుదల కోసం ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తానన్నారు. ఈ సందర్భంగా ఆయన్ను పలువురు ఉద్యోగులు కలిసి అభినందనలు తెలిపారు.

సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు సీఎస్‌కు ఆశీర్వచనం చేసి.. తీర్థ ప్రసాదములు అందజేశారు..

ప్రస్తుత సీఎస్ దినేశ్ కుమార్ పదవీ కాలం ఈరోజుతో ముగియనున్న నేపథ్యంలో కొత్త సీఎస్‌గా అనిల్ చంద్రను ప్రభుత్వం ఖరారు చేసింది. 1984 బ్యాచ్‌కు చెందిన ఆయన తొలుత రాజంపేట సబ్‌కలెక్టర్‌గా తన కెరీర్‌గా ప్రారంభించి.. పలు హోదాల్లో పనిచేశారు.

click me!