నాన్నకు ఇచ్చినట్లే ఉంది: బాలకృష్ణకు టికెట్ పై పవన్ కల్యాణ్

By pratap reddyFirst Published 12, Sep 2018, 9:35 PM IST
Highlights

తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం అభ్యర్థిగా మాజీ కానిస్టేబుల్ పితాని బాలకృష్ణ పేరును ప్రకటించిన విషయంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. 

హైదరాబాద్: తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం అభ్యర్థిగా మాజీ కానిస్టేబుల్ పితాని బాలకృష్ణ పేరును ప్రకటించిన విషయంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు తొలి అభ్యర్థిని పవన్ కల్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. 

తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం నియోజకవర్గ అభ్యర్థిగా మాజీ కానిస్టేబుల్ పితాని బాలకృష్ణ పేరును హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రకటించారు. అయితే పేరు ప్రకటన వెనక రెండు ప్రత్యేక కారణాలున్నాయని ఆయన చెప్పారు. 

తమ నాన్న కానిస్టేబుల్, పితాని కానిస్టేబుల్ అని, పితానికి సీటు ఇవ్వడం అంటే తమ నాన్నకు ఇచ్చినట్టే ఉందని, తమ ఇద్దరిదీ పోలీస్ కులమని ఆయన అన్నారు. 

తాను ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్నప్పుడు జరిగిన విషాద సంఘటనను ఆయన సందర్బంగా గుర్తు చేసుకున్నారు. విద్యుత్ షాక్ తగిలి తోలెం నాగరాజు అనే శెట్టిబలిజ యువకుడు చనిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. 

పితాని కూడా శెట్టిబలిజకు చెందినవారని, ఆయనకు సీటు ప్రకటించడంతో నాగరాజు ఆత్మకు శాంతి కలుగుతుందని పవన్ కల్యాణఅ అన్నారు.

జనసేన పార్టీ తొలి అభ్యర్థి ఎవరో తెలుసా...

Last Updated 19, Sep 2018, 9:24 AM IST