జనసేన ఆఫీస్ కి అంజనాదేవి, రూ.4లక్షల విరాళం:తల్లి ఆశీస్సులు తీసుకున్న పవన్

Published : Oct 30, 2018, 06:59 PM IST
జనసేన ఆఫీస్ కి అంజనాదేవి, రూ.4లక్షల విరాళం:తల్లి ఆశీస్సులు తీసుకున్న పవన్

సారాంశం

జనసేన పార్టీ కార్యాలయాన్ని పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ మాతృమూర్తి అంజనా దేవి సందర్శించారు. స్వయంగా జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చిన అంజనాదేవి పవన్ కు రూ.4లక్షల చెక్కును అందజేశారు. తన తల్లి చెక్ అందిస్తున్నప్పుడు పవన్ ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు.   

హైదరాబాద్: జనసేన పార్టీ కార్యాలయాన్ని పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ మాతృమూర్తి అంజనా దేవి సందర్శించారు. స్వయంగా జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చిన అంజనాదేవి పవన్ కు రూ.4లక్షల చెక్కును అందజేశారు. తన తల్లి చెక్ అందిస్తున్నప్పుడు పవన్ ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. 

పార్టీ కార్యాలయంలో తల్లి కాళ్లకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు పవన్. జనసేన పార్టీ నేతలు నాదెండ్ల మనోహర్, మాదాసు గంగాధర్ తోపాటు పలువురి పార్టీ నేతలను పవన్ తన తల్లి అంజనాదేవికి పరిచయం చేశారు. 
 
ప్రభుత్వ ఉద్యోగులు సీపీఎస్‌ రద్దు కోసం చేస్తున్న పోరాటానికి జనసేన మద్దతు ఉంటుందని పవన్ స్పష్టం చేశారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా పెన్షన్ విలువేంటో తనకు తెలుసునని, అందుకే పెన్షన్ కోసం ఉద్యమిస్తున్న వారికి న్యాయం జరిగే వరకూ అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు.  

పోలీస్ ఉద్యోగం ఎంతో శ్రమతో కూడుకున్నదని, అంటువంటివారి కుటుంబాలకు అండగా నిలవాలని పవన్ కళ్యాణ్ కు చెప్పినట్లు అంజనాదేవి తెలిపారు. తన భర్త వెంకట్రావు ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసినందువల్ల తనకు పెన్షన్ వస్తోందని, ఆ పెన్షన్ మొత్తాన్నే జనసేన పార్టీకి విరాళంగా అందచేసినట్లు చెప్పారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?