జగన్, చంద్రబాబులపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

By pratap reddyFirst Published Jan 13, 2019, 9:00 PM IST
Highlights

ఈ రెండు పార్టీలపై ఎప్పటికీ ఇదే అభిప్రాయం ఉంటుందని పవన్ కల్యాణ్ అన్నారు. తాను టీడీపీకి మద్దతు ఇచ్చింది పోటీచేయడం చేతగాక కాదని, రాష్ట్రం బాగుండాలని మాత్రమేనని అన్నారు. గత ఎన్నికల్లో టీడీపీకి తాను మద్దతు ఇస్తే పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని అన్నారు.

గుంటూరు: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత జగన్‌పై జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసిపిని అవినీతి పునాదుల మీద పుట్టిన పార్టీగా ఆయన అభివర్ణించారు. మామను వెన్నుపోటు పొడిచి పార్టీ నడుపుతున్న వ్యక్తి చంద్రబాబు అని వ్యాఖ్యానించారు. 

ఈ రెండు పార్టీలపై ఎప్పటికీ ఇదే అభిప్రాయం ఉంటుందని పవన్ కల్యాణ్ అన్నారు. తాను టీడీపీకి మద్దతు ఇచ్చింది పోటీచేయడం చేతగాక కాదని, రాష్ట్రం బాగుండాలని మాత్రమేనని అన్నారు. గత ఎన్నికల్లో టీడీపీకి తాను మద్దతు ఇస్తే పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని అన్నారు.
  
దానికి ముందు గుంటూరు తెనాలి మండలం పెదరావూరులోని మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ వ్యవసాయ క్షేత్రంలో ఆయన సంక్రాంతి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాదెండ్ల మనోహర్‌, రావెల కిషోర్ బాబు, మాదాసు, ఇతర నేతలు పాల్గొన్నారు. నందివెలుగు అడ్డరోడ్డు నుంచి జనసేన భారీ ర్యాలీ నిర్వహించింది.
 
అవినీతి పునాదుల మీద పార్టీలు పెట్టిన నేతలు ప్రజలను పీడిస్తున్నారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. రాజకీయపార్టీ పెట్టి లక్ష కోట్లు, లక్షన్నర కోట్ల రూపాయలు దోచుకోవడమేమిటని అడిగారు.

Latest Videos

తాను పదవుల కోసం రాలేదని, దోపిడీకి వ్యతిరేకంగా వచ్చానని ఆయన అన్నారు. పోరాటానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమేనా అని కార్యకర్తలను అడిగారు. 2019 మన భావజాలానికి పరీక్షా సమయమని. ఆలోచించుకోండని అన్నారు. 

ఒక్క అడుగు వేశానని, పది అడుగులు తోడయ్యాయని, ఇంకో అడుగువేద్దామని అన్నారు. సోషల్ మీడియాలో కనిపించకుండా తిట్టుకోవడం కాదు, వాట్సాప్‌లలో మాట్లాడటం కాదు, బయటకు వచ్చి మాట్లాడు, అప్పుడు తెలుస్తుందని అన్నారు. 

click me!