పవన్ కల్యాణ్ అందుకు సిద్ధపడ్డారా: అందుకే ఆ వ్యాఖ్యలా?

By Nagaraju penumalaFirst Published Apr 23, 2019, 5:21 PM IST
Highlights

ఏపీలో టాపిక్ అంతా పవన్ కళ్యాణ్ చుట్టూనే తిరుగుతోంది. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాలో వపన్ కళ్యాణ్ తన ప్రభావం చూపించారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ కచ్చితంగా ఏపీ రాజకీయాల్లో కింగ్ లేదా కింగ్ మేకర్ అవుతారంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. 
 

హైదరాబాద్: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల తర్వాత మౌనం వహించాడానికి కారణం ఏంటి...ఓటమిని ముందే అంగీకరిస్తున్నారా లేక ధీమాతో ఉన్నారా....పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో చివరి రోజు వరకు పవన్ కళ్యాణ్ సీఎం అంటూ చెప్పుకొచ్చారు. 

అటు రాజకీయ విశ్లేషకులు సైతం ఏపీలో పవన్ కళ్యాణ్ కింగ్ అయినా లేకపోతే కింగ్ మేకర్ అయినా అవుతారని ప్రచారం కూడా జరిగింది. అయితే ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయ్యిందని ప్రచారం కూడా సాగుతోంది. ఫ్యాన్ గాలి బాగా వీచిందంటూ సర్వేలు చెప్తున్నాయి. 

ఎన్నికల అనంతరం పవన్ కళ్యాణ్ అలా వచ్చి వెళ్లిపోయారు. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం ఈవీఎంలపై దండయాత్ర చేస్తున్నారు. పొరుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ నానా హంగామా చేస్తున్నారు. 

అటు ప్రతిపక్ష పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం ధీమాగానే ఉన్నారు. ఇటీవలే గవర్నర్ నరసింహన్ కలిసి తెలుగుదేశం పార్టీ దాడులపై ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత స్విట్జర్లాండ్ వెళ్లిపోయారు. అయితే ఇప్పుడు ఏపీలో టాపిక్ అంతా పవన్ కళ్యాణ్ చుట్టూనే తిరుగుతోంది. 

ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాలో వపన్ కళ్యాణ్ తన ప్రభావం చూపించారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ కచ్చితంగా ఏపీ రాజకీయాల్లో కింగ్ లేదా కింగ్ మేకర్ అవుతారంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. 

కాపు సామాజిక వర్గం తీవ్ర ప్రభావం చూపే 20 నియోజకవర్గాలలో గెలుపుపై ధీమాగా ఉన్నారట పవన్. గుంటూరు జిల్లాలో గుంటూరు వెస్ట్, తెనాలి, సత్తెన పల్లి వంటి మూడు నియోజకవర్గాల్లో జనసేన విజయం సాధిస్తోందని జనసేన ఆశిస్తోంది. 

ఇకపోతే తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్తిపాడు, కొత్తపేట, అమలాపురం, రామచంద్రపురం, పి.గన్నవరం, రాజమహేంద్రవరం రూరల్, తుని, కాకినాడ రూరల్ తోపాటు తణుకు, తిరుపతి, తంబళాపల్లి, కావలి, నెల్లూరు అర్బన్ , విజయవాడ ఈస్ట్ , కైకలూరు, అవనిగడ్డ, నర్సాపురంనియోజకవర్గాలను తమ ఖాతాలోనే వేసుకుంటోంది జనసేన పార్టీ.

మరోవైపు తాడేపల్లిగూడెం ,నిడదవోలు, నెల్లిమర్ల, గాజువాక, యలమంచిలి, గన్నవరం,పెందుర్తి, పెడన, పాతపట్నం, భీమవరం, ఇచ్చాపురం, రైల్వే కోడూరు, భీమిలితోపాటు రెండు పార్లమెంట్ స్థానాలను సైతం గెలుచుకునే అవకాశం ఉందని జనసేన సర్వేలో తేలినట్లు తెలుస్తోంది. 

2009లో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ సైతం 18 స్థానాలను గెలుచుకుంది. ప్రస్తుతం జనసేన ఆశిస్తున్న స్థానాల్లో ఆ సీట్లు కూడా ఉండటం గమనార్హం. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీకి అన్ని సామాజిక వర్గాల నుంచి మంచి ఆదరణ లభించిందని టాక్. 

దళిత, బీసీ సామాజిక వర్గాలు సైతం జనసేనకు జై కొట్టారని ఫలితంగా జనసేనకు 20 స్థానాలు లేదా అంతకు మించి గెలిచే అవకాశం లేకపోలేదని ప్రచారం కూడా జరుగుతోంది. మెుత్తానికి పవన్ కళ్యాణ్ ఆశిస్తున్నట్లు 20కి పైగా సీట్లలో జనసేన విజయం సాధిస్తే కచ్చితంగా కింగ్ లేదా కింగ్ మేకర్ అవ్వడంలో ఎలాంటి సందేహం లేదు. మరి పవన్ కళ్యాణ్ ఆశలు నెరవేరుతాయా సోదరుడు మెగాస్టార్ చిరంజీవి పార్టీ కంటే అత్యధిక సీట్లు సాధిస్తారా అన్నది తెలియాలంటే మే 23 వరకు వేచి చూడాల్సిందే. 

click me!