కాళ్లు విరగొట్టి మూలన కూర్చోబెడతా: టీడీపీ, వైసీపీలకు పవన్ వార్నింగ్

By Nagaraju TFirst Published Sep 27, 2018, 8:07 PM IST
Highlights

ప్రజా పోరాట యాత్రలో జనసేన అధినేత పవన్‌కళ్యాన్ తన వ్యాఖ్యలకు పదును పెంచారు. మాటల తూటాలతో అధికార ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడుతున్నారు. దెందులూరులో స్థానిక ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు వార్నింగ్ ఇచ్చిన పవన్ తాజాగా టీడీపీ, వైసీపీ నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

ఏలూరు: ప్రజా పోరాట యాత్రలో జనసేన అధినేత పవన్‌కళ్యాన్ తన వ్యాఖ్యలకు పదును పెంచారు. మాటల తూటాలతో అధికార ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడుతున్నారు. దెందులూరులో స్థానిక ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు వార్నింగ్ ఇచ్చిన పవన్ తాజాగా టీడీపీ, వైసీపీ నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రజాపోరాట యాత్రలో భాగంగా పశ్చిమగోదావరి  జిల్లా గణపవరంలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తలను టీడీపీ, వైసీపీ నేతలు బెదిరిస్తే సహించేదిలేదని హెచ్చరించారు. 

జనసేన కార్యకర్తలను ఇబ్బంది పెడితే కాళ్లు విరగ్గొట్టి మూలకు కూర్చోబెడతామని హెచ్చరించారు. డబ్బుంటే ఎన్నికల్లో గెలవగలము అని అనుకుంటే పొరపాటన్న పవన్ డబ్బులేని రాజకీయాలు తీసుకురావడమే జనసేన లక్ష్యమన్నారు. జనసేనకు కేవలం 5శాతం ఓట్లే వస్తాయని ఓ పార్టీ సర్వేలే తేలిందని చెప్పారని మరి ఆ పార్టీకి ఎందుకు భయపడుతున్నారని విమర్శించారు. 

రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి రావాలో నిర్ణయించేది తామేనని పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. జనసేన పార్టీ సత్తా ఏంటో వచ్చే ఎన్నికల్లో నిరూపిస్తామని పవన్ స్పష్టం చేశారు. జనసేన అధికారంలోకి రాగానే అగ్రకులాల పేదలకు కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామంటూ హామీ ఇచ్చారు. దళితులకు జనసేన అండగా ఉంటుంది అని పవన్‌కల్యాణ్‌ భరోసా ఇచ్చారు.
 
బుధవారం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై పవన్‌కళ్యాణ్ తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. గాలి రౌడీలు, ఆకు రౌడీలకు భయపడే వ్యక్తిని కాదు. ఒక్క సైగ చేస్తే కాళ్ళు విరగ్గొట్టి కూర్చోబెడతారు...ఖబడ్దార్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

16 ఏళ్ల వయసులోనే ఆకు రౌడీలు, గాలి రౌడీలను తన్ని తగలేశానని చెప్పుకొచ్చారు. 27 కేసులున్న వ్యక్తిని విప్‌గా నియమించిన టీడీపీ టీడీపీకి తాను ఎందుకు అండగా ఉండాలని ప్రశ్నించారు. చింతమనేని లాంటి వ్యక్తి సింగపూర్‌లో ఉంటే కర్రతో కొడతారు. సౌదీ అరేబియాలో అయితే తల తీసేస్తారు అంటూ ధ్వజమెత్తారు.  

చింతమనేని ప్రభాకర్ పై చేసిన ఘాటు వ్యాఖ్యలు మరచిపోకముందే మరోసారి కాళ్లు విరగ్గొడతానంటూ టీడీపీ వైసీపీ నేతలకు వార్నింగ్ ఇవ్వడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 

click me!