టెక్కీలకేనా, టీచర్లకు కూడా..: పవన్ కల్యాణ్ వీడియో వైరల్

By pratap reddyFirst Published 5, Sep 2018, 5:51 PM IST
Highlights

టీచర్స్ డే సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ కల్యాణ్ ఆ వీడియోలో ఉపాధ్యాయుల గురించి మాట్లాడారు.

హైదరాబాద్: టీచర్స్ డే సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ కల్యాణ్ ఆ వీడియోలో ఉపాధ్యాయుల గురించి మాట్లాడారు. 

టీచర్లకు మంచి జీతాలు ఇచ్చి.. నాణ్యమైన విద్యను అందించినప్పుడే ప్రభుత్వ విద్యావ్యవస్థ మెరుగుపడుతుందని పవన్ వీడియోలో అభిప్రాయపడ్డారు. దేశంలో ఐటీ, బ్యాంకు ఉద్యోగులకు జీతాలు ఎక్కువగా ఉన్నాయని, టీచర్లపై కూడా ఎక్కువ దృష్టిపెట్టాలని ఆయన అన్నారు. 

టీచింగ్ వృత్తి చాలా ఉన్నతమైందని అభిప్రాయపడ్డారు. అత్యధిక జీతాలు అందుకునే వృత్తులలో బోధన ప్రథమస్థానంలో ఉండాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు దెబ్బతినడానికి విద్యాప్రమాణాల్లో నాణ్యత లేకపోవడమే కారణమన్నారు. 

తమ పార్టీ అధికారంలోకి వస్తే ఉచిత విద్యను అందిస్తుందని చెప్పారు. లిక్కర్‌పై పెట్టుబడి పెట్టేకన్నా విద్యావ్యవస్థపై పెడితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.

Last Updated 9, Sep 2018, 12:26 PM IST