జనసేన పార్టీ గుర్తు పిడికిలి- ప్రకటించిన పవన్ కళ్యాణ్

Published : Aug 13, 2018, 07:39 PM ISTUpdated : Sep 09, 2018, 12:50 PM IST
జనసేన పార్టీ గుర్తు పిడికిలి- ప్రకటించిన పవన్ కళ్యాణ్

సారాంశం

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీ గుర్తును ప్రకటించారు. ప్రజాపోరాట యాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు బహిరంగ సభలో పాల్గొన్న జనసేనాని పవన్ కళ్యాణ్ తన ఎన్నికల గుర్తు ప్రకటించారు. తమ పార్టీ గుర్తు పిడికిలి అని స్పష్టం చేశారు.   

పశ్చిమగోదావరి జిల్లా:

సమాజంలో అందరి ఐక్యతకు చిహ్నంగా పిడికిలి ఉంటుందని అందుకే పిడికిలి పార్టీ గుర్తుగా ప్రకటించినట్లు తెలిపారు. అన్ని కులాలు, మతాలు ఐక్యమత్యంగా ఉండి తమ  బలాన్ని పిడికిలి రూపంలో తెలియజేస్తారని తెలిపారు. జనసేన పార్టీ అందరి పార్టీ అని అన్ని వర్గాల పార్టీ అన్నారు. 

PREV
click me!

Recommended Stories

Vizag Steel Plant Incident: విశాఖ ఉక్కు కర్మాగారం ఘోర విషాదం వెనుక వొళ్ళు గగురుపుట్టే నిజాలు
IMD Rain Alert : ఏపీలో 7, తెలంగాణలో 7 జిల్లాలకు హైఅలర్ట్.. భారీ నుండి అతిభారీ వర్షాలతో అల్లకల్లోలమే