ఇంట్రెస్టింగ్.. ఒకే జిల్లాలో.. పవన్, రేణుదేశాయ్ పర్యటన

Published : Feb 25, 2019, 09:56 AM IST
ఇంట్రెస్టింగ్.. ఒకే జిల్లాలో.. పవన్, రేణుదేశాయ్ పర్యటన

సారాంశం

కర్నూలు జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.

కర్నూలు జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. ఆయన మాజీ భార్య రేణుదేశాయ్ కూడా ప్రస్తుతం కర్నూలు జిల్లాలోనే పర్యటిస్తుండటం గమనార్హం. ఇద్దరూ ఒకే జిల్లాలో పర్యటించడం ఇప్పుడు సర్వత్రా ఆసక్తినెలకొంది. 

ఇంతకీ అసలు మ్యాటరేంటంటే.. త్వరలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. పార్టీ బలాన్ని పెంచుకునేందుకు పవన్ ఏపీలో పర్యటిస్తున్నారు. కాగా.. ఆదివారం నుంచి ఆయన కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. నేడు కూడా ఆయన పర్యటన కొనసాగనుంది. ఈ పర్యటనలో భాగంగా ఆయన ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు.

ఇదిలా ఉంటే.. ఆయన మాజీ భార్య రేణుదేశాయ్ కూడా రైతుల సమస్యలు తెలుసుకునేందుకు కర్నూలులో పర్యటిస్తున్నారు. ఆదివారం రాత్రే ఆమె మంత్రాలయం చేరుకున్నారు. స్థానిక ఎస్‌వీబీ అతిథిగృహంలో బస చేసిన ఆమె ఉదయాన్నే.. ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఆత్మహత్యకు కారణాలు, బాధిత కుటుంబాల పరిస్థితులు  అడిగి తెలుసుకోనున్నారు. 

అయితే.. పవన్ కి మద్దతుగా రేణు ఈ పర్యటన చేస్తున్నారు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే.. ఆమె.. త్వరలో రైతు సమస్యలపై సినిమా తీయనున్నారు. ఈ నేపథ్యంలో.. ఆమె ఈ పర్యటన చేస్తున్నారు. కాగా.. మాజీ భార్య భర్తలిద్దరూ ఒకే జిల్లాలో పర్యటిస్తుండటంతో.. అందరి ఆసక్తికనపరుస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Raghurama Krishnam Raju: కోడిపందాలను ప్రారంభించిన ఏపీ డిప్యూటీ స్పీకర్ RRR | Asianet News Telugu
RK Roja Bhogi Lecebrations With Family: భోగి రోజు రంగురంగు ముగ్గులు వేసిన రోజా| Asianet News Telugu