నేను బల ప్రదర్శన చేస్తే.. శత్రువులు మిగలరు.. పవన్

Published : Oct 16, 2018, 03:00 PM IST
నేను బల ప్రదర్శన చేస్తే.. శత్రువులు మిగలరు.. పవన్

సారాంశం

రాజ్యాంగం ప్రకారం పాలన అందిస్తే ఇబ్బంది ఉండదని...కానీ అలా జరగట్లేదని పవన్ అన్నారు. కాటన్‌ ఎంతో ఉన్నత ఆశయంతో ఆనకట్ట కట్టారని తెలిపారు. 

తాను బల ప్రదర్శన చేస్తే.. శత్రువులు ఎవరూ మిగలరని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న పవన్.. అక్కడ మాట్లాడారు. అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలపై ఆయన విరుచుకుపడ్డారు. 

రాజ్యాంగం ప్రకారం పాలన అందిస్తే ఇబ్బంది ఉండదని...కానీ అలా జరగట్లేదని పవన్ అన్నారు. కాటన్‌ ఎంతో ఉన్నత ఆశయంతో ఆనకట్ట కట్టారని తెలిపారు. సీఎం చంద్రబాబు కూడా పోలవరం ప్రాజెక్టును పారదర్శకంగా నిర్మించాలని సూచించారు. తాను బలప్రదర్శన చేస్తే శత్రువులు మిగలరని పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యానించారు. తిత్లీ తుఫాను బాధితులను పరామర్శించేందుకు రేపు శ్రీకాకుళం వెళ్లనున్నట్లు ఆయన వివరించారు. 
 
నిన్న తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీపై నిర్వహించిన ‘కవాతు’, ఆ తర్వాత జరిగిన భారీ బహిరంగ సభలో పవన్‌ కల్యాణ్‌ ఆవేశంగా ప్రసంగించారు. వారసత్వ రాజకీయాలపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.   

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్