పార్వతీపురం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

By Siva KodatiFirst Published Mar 28, 2024, 3:28 PM IST
Highlights

కురుపాం రాజవంశీకులు పార్వతీపురంపై ప్రభావం చూపుతున్నారు. ఎన్నికల్లో రాజులు ఎవరికి మద్ధతు ఇస్తే వారిదే విజయం. క్షత్రియులతో పాటు బీసీ, ఎస్సీ ఓటు బ్యాంక్ అధికం. అన్నింటికి మించి కొప్పల వెలమలు అభ్యర్ధుల గెలుపొటములను శాసిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్, టీడీపీలు ఐదేసి సార్లు.. ఇండిపెండెంట్లు రెండు సార్లు, స్వతంత్ర పార్టీ, జనతా పార్టీ, వైసీపీలు ఒక్కోసారి విజయం సాధించాయి. పార్వతీపురంలో 2019 నాటి రిజల్ట్‌ను అందుకోవాలని జగన్ పట్టుదలతో వున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే జోగారావుకే ఆయన టికెట్ కేటాయించారు.  టీడీపీ అభ్యర్ధిగా బోనెల విజయ్ చంద్రకు అవకాశం కల్పించారు చంద్రబాబు. 

ఉమ్మడి విజయనగరం జిల్లా పార్వతీపురం ఏజెన్సీ ముఖద్వారంగా గుర్తింపు తెచ్చుకుంది. విభిన్నంగా తీర్పు ఇవ్వడంలో ఇక్కడి ప్రజలు ఎప్పుడూ ముందుంటారు. 1952లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 1,82,333 మంది. తొలినాళ్లలో జనరల్ కేటగిరిగా వున్న ఈ సెగ్మెంట్ 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా జనరల్ కేటగిరీ నుంచి ఎస్సీ కేటగిరీలోకి మారింది. బొబ్బిలి నియోజకవర్గంలోని సీతానగరం మండలాన్ని ఈ నియోజకవర్గంలో కలిపారు. బలిజపేట, మక్కువ మండలాలు ఈ సెగ్మెంట్ పరిధిలోకి వచ్చాయి. పక్కనేవున్న కురుపాం రాజవంశీకులు పార్వతీపురంపై ప్రభావం చూపుతున్నారు. ఎన్నికల్లో రాజులు ఎవరికి మద్ధతు ఇస్తే వారిదే విజయం. 

పార్వతీపురం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 .. రాజుల మాటే శాసనం :

1952లో నియోజకవర్గం ఏర్పడిన కొత్తలో మాజీ కేంద్ర మంత్రి వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ తండ్రి దుర్గాప్రసాద్ దేవ్ ఎమ్మెల్యేగా గెలిచి.. పార్వతీపురం తొలి శాసనసభ్యుడిగా రికార్డుల్లోకెక్కారు. క్షత్రియులతో పాటు బీసీ, ఎస్సీ ఓటు బ్యాంక్ అధికం. అన్నింటికి మించి కొప్పల వెలమలు అభ్యర్ధుల గెలుపొటములను శాసిస్తున్నారు. వారు ఏ పార్టీవైపు మొగ్గుచూపుతు వారిదే విజయం. కొప్పల వెలమలు మూడు మండలాలలో పాటు పార్వతీపురం పట్టణంలోనూ బలంగా వున్నారు. 

ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్, టీడీపీలు ఐదేసి సార్లు.. ఇండిపెండెంట్లు రెండు సార్లు, స్వతంత్ర పార్టీ, జనతా పార్టీ, వైసీపీలు ఒక్కోసారి విజయం సాధించాయి. 1983లో టీడీపీ ఆవిర్భావం నుంచి 1994 వరకు ఆ పార్టీ ఎదురులేకుండా విజయాలు సాధించింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి అలజంగి జోగారావుకు 75,304 ఓట్లు.. టీడీపీ అభ్యర్ధి బొబ్బిలి చిరంజీవులకు 51,105 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా వైసీపీ 24,199 ఓట్ల మెజారిటీతో పార్వతీపురంలో తొలిసారిగా పాగా వేసింది.

పార్వతీపురం శాసనసభ ఎన్నికల ఫలితాలు 2024 .. టీడీపీ, వైసీపీ హోరాహోరీ :

2024 ఎన్నికల విషయానికి వస్తే.. పార్వతీపురంలో 2019 నాటి రిజల్ట్‌ను అందుకోవాలని జగన్ పట్టుదలతో వున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే జోగారావుకే ఆయన టికెట్ కేటాయించారు. వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తనను గెలిపిస్తాయని జోగారావు ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ విషయానికి వస్తే.. తన ఒకప్పటి కంచుకోటలో పాగా వేయాలని చంద్రబాబు భావించారు. టీడీపీ అభ్యర్ధిగా బోనెల విజయ్ చంద్రకు అవకాశం కల్పించారు. జగన్ పాలనపై వ్యతిరేకత, టీడీపీ జనసేన బీజేపీ పొత్తు తనకు కలిసొస్తుందని చంద్ర ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

click me!