పరిటాల సునీత: బాల్యం, విద్యాభ్యాసం, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం  

By Rajesh KarampooriFirst Published Mar 28, 2024, 12:34 PM IST
Highlights

Paritala Sunitha Biography: ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో పరిటాల కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. అనంతపురం జిల్లా రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు పరిటాల రవి. కానీ  ప్రత్యార్థుల చేతిలో ఆయన అత్యంత దారుణంగా హత్య చేయబడ్డారు. ఈ ఘటన తరువాత ఆయన సతీమణి పరిటాల సునీత రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆయన అభిమానులకు,  ప్రజలకు అండగా నిలిచారు. ఈ నేపథ్యంలో  పరిటాల సునీత వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం గురించి తెలుసుకుందాం.  

Paritala Sunitha Biography: ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో పరిటాల కుటుంబానికి ప్రత్యేక పేజీ ఉంటుంది. ప్రత్యేకంగా అనంతపురం జిల్లాలో ఆ కుటుంబానికి చెరగని స్థానం ఉంది. ఇందుకు కారణం పరిటాల రవి. ఆయన పేరు వింటేనే ఒక ధైర్యం ఒక భరోసా. ఆయన ఎక్కడ ఉన్నా ఎంతో హడావిడి ఉండేది. ఆయనను చూడటానికి, పలకరించడానికి నిత్యం వందలాది మంది జనం వచ్చేవారు. పరిటాల రవి మూడు దశాబ్దాల క్రితమే తెలుగుదేశం ద్వారా రాజకీయాల్లోకి వచ్చి ప్రజా నేతగా నిలిచారు. కానీ, ప్రత్యార్థుల చేతిలో పరిటాల రవి అత్యంత దారుణంగా హత్య చేయబడ్డారు. ఈ ఘటన తరువాత ఆయన సతీమణి పరిటాల సునీత రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆయన అభిమానులకు,  ప్రజలకు అండగా నిలిచారు. పరిటాల సునీత రాజకీయ ప్రస్థానం  కంటే ముందుగా పరిటాల రవి జీవిత చరిత్ర తెలుసుకుందాం.  

పరిటాల రవి బయోగ్రఫీ

పరిటాల రవి..  ఆగస్టు 30 1958న అనంతపురం జిల్లా వెంకటాపురంలో జన్మించారు. తండ్రి పేరు శ్రీరాములు, తల్లి పేరు నారాయణమ్మ. ఆయన తండ్రి శ్రీ రాములు అనంతపురం జిల్లాలో భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసేవారు. దీంతో 1975లో పరిటాల శ్రీరాములు, ఆయన తమ్ముడు పరిటాల సుబ్బయని భూస్వాములు హత్య చేశారు. తండ్రి చనిపోయే నాటికి పరిటాల రవి వయసు 15 సంవత్సరాలు. ఈ ఘటనతో  కుటుంబంలో అభద్రతాభావం నెలకొంది.

ఈ తరుణంలో తల్లి నారాయణమ్మకి అండగా నిలిచిన పరిటాల రవి తన తమ్ముడు హరితో పాటు కష్టపడి పనిచేసి తన తండ్రి చేసిన అప్పులు తీర్చారు. అంత సాఫీగా సాగుతున్న తరుణంలో తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్న తమ్ముడు హరిని బూటకపు ఎన్కౌంటర్ లో పోలీసులు చంపేశారు. ఈ ఘటనతో ఆ కుటుంబంలో మరింత విషాదం నెలకొంది. మరోవైపు..  పరిటాల శ్రీరాములు హత్య కుట్రలో ముఖ్యుడైన  నారాయణరెడ్డిని పీపుల్స్ పార్టీ 1983లో కాల్చి చంపింది. ఆ ఘటన అప్పట్లో తీవ్ర చర్చనీయంగా మారింది. ఈ హత్య కేసులో పరిటాల రవిని ప్రధాన ముద్దాయిగా చేర్చారు. దీంతో పరిటాల రవి అజ్ఞాత జీవితంలోకి వెళ్లిపోయారు. అప్పడప్పుడు తన కుటుంబాన్ని, తన అనుచరులను కలుస్తుండేవారు. 

1983లో ఏపీలో రాజకీయాల్లో అనూష్య మార్పులు చేసుకున్నారు. ఈ ఏడాది జరిగిన  అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భారీ విజయం సాధించింది. దీంతో పార్టీ అధినేత ఎన్ టి రామారావు ముఖ్యమంత్రి అయ్యారు. ఈ ప్రభావంతో రాయలసీమ రాజకీయాల్లోనూ పలు మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో 1984లో పరిటాల రవీంద్ర తన స్వగ్రామం వెంకటాపురానికి చేరుకున్నారు. 1984 అక్టోబర్ 23 కొండన్న గారి పెద్ద కుమార్తె సునీతతో పరిటాల రవి గారికి వివాహం జరిగింది. 

కానీ, ప్రత్యార్థులతో ప్రమాదం ఉందని అనుచరులు హెచ్చరించగా.. మరి కొంతకాలం అజ్ఞాత జీవితం లోకి వెళ్లిపోయిన రవి కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో రహస్య జీవితం గడిపారు. ఈ సమయంలోనే  కొండపల్లి సీతారామయ్య గారితో సాహిత్యం ఏర్పడింది. ఎలాగోలా హత్య కేసు నుంచి బయటపడ్డ ఆయన తిరిగి వెంకటాపురం చేరుకున్నారు. ఆ తరువాత పరిటాల రవి తన తండ్రి, తమ్ముడు సాగించిన భూస్వామ్య వ్యతిరేక పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్లారు. 1991 నుంచి విస్తృంకల స్వైర్య విహారం చేస్తున్న అరాచక శక్తుల్ని రకరకాల పద్ధతుల ద్వారా ఎదురుకోవడంతో పరిటాల రవి ప్రజల దృష్టిలో హీరో అయ్యారు.

టీడీపీలో చేరిక

తెలుగు దేశం పార్టీ స్థాపకుడు ఎన్టీఆర్ పిలుపు మేరకు పరిటాల రవి 1993 జూన్ 7న పార్టీలో చేరి తన రాజకీయ ప్రస్తానాన్ని ప్రారంభించారు. ఒక్క అనంతపురం జిల్లాలోనే కాదు. రాయలసీమ అంతటా ఆయనకు టిడిపి కార్యకర్తలు, సానుభూతిపరులు బ్రాహ్మరథం పట్టారు. ఇదిలాఉంటే.. 1993 అక్టోబర్ 24న మద్దెల చెరువు గ్రామంలో ఓ టివి బాంబు సంఘటన జరిగింది. ఈ ఘటనలో మద్దెలచెరువు సూరి తమ్ముడు రఘునాథ్ రెడ్డితో సహా ఆరుగురు చనిపోయారు. ఈ సంఘటనకు ప్రధాన కారకుడు పరిటాల రవినే అని కాంగ్రెస్ నాయకులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కానీ, ఈ తరుణంలో జరిగిన ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో కార్మిక శాఖ మంత్రి అయ్యారు.

కారు బాంబు దాడి

రాజకీయాల్లో బీజీబిజీగా ఉన్న పరిటాల రవి తన తండ్రి జీవిత చరిత్ర ఆధారంగా ఓ చిత్రాన్ని తెరకెక్కించాలని భావించారు. 1996 నవంబర్ 19న శ్రీరాములయ్య అనే పేరుతో సినిమా ముహూర్తం చేశారు. ఈ సమయంలో ఆయనపై కారు బాంబు దాడి చేశారు. ఈ దాడి పరిటాల రవి తీవ్రంగా గాయపడ్డారు. అలాగే ఈ ఘటనలో దాదాపు 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు నిందితులైన  పరిటాల రవిని హతమార్చేందుకు పథకం వేసిన మద్దెలచెరువు సూరి, అతని అనుచరులు అరెస్టు చేశారు. 

పరిటాల రవి హత్య 

2005 జనవరి 24న అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎవరు ఊహించిన ఘటన జరిగింది. మధ్యాహ్న ప్రాంతంలో కార్యకర్తలు, అభిమానులతో పార్టీ కార్యాలయం బయటకు వస్తున్న పరిటాల రవిపై ఒక్కసారిగా తుటాల వర్షం కురిసింది. ఆ దాడి ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో రాయలసీయ ప్రజలు నిర్గాంత పోయారు. పరిటాల రవి ప్లేస్ లోకి ఆయన సతీమణి పరిటాల సునీతమ్మ రాజకీయాల ప్రవేశం చేసింది.  చంద్రబాబు, అలాగే తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు అందరూ ఆమెకి అండగా నిలబడ్డారు. 
 
పరిటాల సునీత గురించి తెలుసుకుందాం. 

బాల్యం, కుటుంబ నేపథ్యం 

పరిటాల సునీత 1970 మే 20న అనంతపురం జిల్లా రామగిరి మండలంలో ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. తండ్రి ధర్మవరపు కొండన్న, తల్లి సత్యవతి. ఆమె కేవలం 8 వ తరగతి వరకే చదువుకుంది.  ఆమె వివాహం పరిటాల రవీంద్ర గారితో 1984 అక్టోబర్ 27న జరిగింది. వీరికి ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి. 

రాజకీయ ప్రవేశం 

సాధారణ గృహిణిగా ఉన్న పరిటాల సునీత .. భర్త పరిటాల రవి హత్య తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఈ తరుణంలో ఆమె కుటుంబానికి టిడిపి తరఫున చంద్రబాబు అండగా నిలిచారు. 2005లో పరిటాల రవి మరణంతో సునీత వినుకొండ నుంచి పోటీ చేశారు. టిడిపి తరఫున బైపోల్లో ఆమె గెలుపొందారు. అలాగే 2009లో 2014లో రాప్తాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి టిడిపి ప్రభుత్వ హయాంలో మహిళా సాధికారత, శిశు సంక్షేమం, వికలాంగుల వృద్ధుల సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు.

సునీత 2019లో తన కుమారుడు పరిటాల శ్రీరామ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ సమయంలో (2019) ఎన్నికల్లో ఆమె పోటీ చేయలేదు. గత ఎన్నికల్లో వైసిపి నుంచి పోటీ చేసిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి.. శ్రీరామ్ ను ఓడించారు. ఆ తర్వాత ధర్మవరంలో ఓడిన మాజీ ఎమ్మెల్యే వరదపురం సూరి బిజెపిలోకి వెళ్లిపోవడంతో ధర్మవరం టిడిపికి సరైన నాయకుడు లేకుండా పోయారు. ఈ తరుణంలో అక్కడ పర్యటించిన చంద్రబాబు .. ధర్మవరం, రాప్తాడు రెండు నియోజకవర్గాలకు పరిటాల ఫ్యామిలీకి అప్పగిస్తున్నట్టు ప్రకటించారు.

click me!