కడప జిల్లాలో కాల్పులు, పార్థసారథి రెడ్డి మృతి: హంతకుడు శివప్రసాద్ రెడ్డి ఆత్మహత్య

Published : Jun 15, 2021, 08:30 AM ISTUpdated : Jun 15, 2021, 09:38 AM IST
కడప జిల్లాలో కాల్పులు, పార్థసారథి రెడ్డి మృతి: హంతకుడు శివప్రసాద్ రెడ్డి ఆత్మహత్య

సారాంశం

ఏపీలోని పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లెలో కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. ఎంపీపీ శివప్రసాద్ రెడ్డి పార్థసారథిరెడ్డి అనే వ్యక్తిపై కాల్పులు జరిపాడు. ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు.

కడప: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలో సంచలన సంఘటన చోటు చేసుకుంది. కడప జిల్లా పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లెలో కాల్పుల ఘటన జరిగింది. ఇది స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

ఎంపీపీ శివప్రసాద్ రెడ్డి పార్థసారథి రెడ్డి అనే వ్యక్తిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పార్థసారథి రెడ్డి అక్కడికక్కడే మరణించాడు. ఆ తర్వాత శివప్రసాద్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు.  గన్ తో కాల్చుకుని శివప్రసాద్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. పాత కక్షలే ఈ ఘటనకు కారణమని చెబుతున్నారు.

పార్థసారధి రెడ్డి (48), ప్రసాద్ రెడ్డి ( 62 ) ఇరువురు బంధువులు. వీరి కుటుంబాల మధ్య పాత కక్షలు ఉన్నాయి.  ఈరోజు ఉదయం ప్రసాద్ రెడ్డి  ఇంటి పైకి మచ్చు కత్తి తీసుకొని  పార్థసారధి రెడ్డి దాడి చేయబోయాడు. 

తనను చంపుతా డెమోననే ఆందోళనతో ప్రసాద్ రెడ్డి ( కాబోయే మండలాధ్యక్షుడు) తన దగ్గర ఉన్న లైసెన్స్  తుపాకీతో  పార్థసారధి రెడ్డి పై రెడ్డిపై కాల్పులు జరిపాడు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు

అనంతరం అదే తుపాకితో  ప్రసాద్ రెడ్డి  కూడా తన లైసెన్సు రివాల్వర్ తో ఆయనే కాల్చుకొని మృతి చెందాడు. రెండు కుటుంబాలను ముగ్గులు వైయస్ కుటుంబీకులు పులివెందుల ఆసుపత్రిలో ఆస్పత్రిలో పరామర్శించారు. ప్రస్తుతం పోలీసులు గ్రామంలో శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Republic Day Celebrations in Amaravati: చంద్రబాబుకి పవన్ కి లోకేష్ ఘన స్వాగతం| Asianet News Telugu
Republic Day Celebrations in Amaravati: గణతంత్ర వేడుకల్లో ఏపీ పోలీస్ కవాతు| Asianet News Telugu